1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
  4. dr raman astrology

సదాశివుడిని ఆరాధించండి... మారేడు చెట్టును నాటిన శుభం(వి.ఎస్ కిరణ్ కుమార్-మచిలీపట్నం)

dr raman astrology
వి.ఎస్. కిరణ్ కుమార్-మచిలీపట్నం: మీరు నవమి ఆదివారం, తులా లగ్నము, మృగశిర నక్షత్రం వృషభరాశి నందు జన్మించారు. ధనాధిపతి అయిన కుజుడు అష్టమము నందు ఉండటం వల్ల కుజ బంధనం దోషం ఏర్పడటం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని 2017 నుంచి 2033 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. ప్రతిరోజూ సదాశివుడిని సర్వదా ఆరాధించండి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఏదైనా దేవాలయంలో మారేడు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
About Writer
Raman