Astrology Yearly Horoscope Details

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆదాయం-2 వ్యయం-11 రాజపూజ్యం-4 అవమానం- 7 ఈ సంవత్సరం ఈ రాశివారికి పరీక్షా సమయం. ఓర్పుతో శ్రమిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార, సంప్రదింపులతో సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయం పెంచుకునే దిశగా యత్నాలు సాగిస్తారు. ఆప్తుల సాయంతో కొన్ని అవసరాలు నెరవేరుతాయి. పొదుపు పథకాలు కలిసిరావు. దంపతుల మధ్య తరచు కలహాలు, వెంటనే రాజీపడటం జరుగుతుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. త్వరలో ఇంతకంటే మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించి ఆలోస్తారు. పిల్లల విషయంలో ఆందోళన చెందవద్దు. వారికి మంచి ర్యాంకులు, విదేశీ విద్యావకాశాలు లభిస్తాయి. గృహనిర్మాణాలు పూర్తికావస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. వ్యవసాయపరంగా మెట్టరైతులకు కష్టకాలం. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ఆస్కారం ఉంది. వారికి అందిన సాయం అసంతృప్తి కలిగిస్తుంది. మాగాణి రైతులకు బాగుంటుంది. అధిక దిగుబడి సాధించటంతో పాటు గిట్టుబాటు ధర లభిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనంతో కూడిన పదోన్నతి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు సాధించే ఉత్తమ ఫలితాలపై వీరి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత, లక్ష్యం పట్ల నిరంతర కృషి ముఖ్యం. పట్టుదలతో శ్రమించి మంచి ర్యాంకులు సాధించగల్గుతారు. వీరికి విదేశీ విద్యావకాశం లభించే అవకాశం తక్కువే. సాఫ్ట్‌వేర్ రంగ విద్యార్థులకు ప్రోత్సాహకరమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా చూస్తే హోల్సేల్ వ్యాపారులకు, స్టాకిస్టులకు ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సామాన్యంగా ఉంటుంది. న్యాయ, వైద్య, విద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. న్యాయవాదులు చేపట్టిన కేసుల్లో విజయం సాధిస్తారు. వైద్యరంగాల వారికి శస్త్ర చికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. ప్రభుత్వ లెక్చరర్లకు బదిలీతో కూడిన పదోన్నతి. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహించాలి. ఔషధ సేవనం, ఆహార నియమాల్లో అలక్ష్యం తగదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరి సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. తరచుగా శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, వెండి, బంగారాలు అపహరణకు గురయ్యే ఆస్కారం ఉంది. బంధుమిత్రలతో సత్సంబంధాలు, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అయిన వారితో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. పూర్వ గురువులు, స్నేహితులను కలుసుకుంటారు. వాహనం అమర్చుకోవాలనే కోరిక అతికష్టంమ్మీద నెరవేరుతుంది. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగవకాశం లభిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ధార్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం కొంతమేరకు శుభదాయకంగాను, సమస్యాత్మకంగాను ఫలితాలు ఉండగలవు.

పెళ్లైన కొన్ని నెలలకే భార్యను హత్య చేసి తలను ఫ్రిడ్జ్‌లో పెట్టిన భర్త.. ఎక్కడ?

ఆసియాలోనే తొలిసారిగా సిమ్స్‌లో న్యూ జనరేషన్ బోన్-స్పారింగ్ హిప్ ఆపరేషన్

ఆసియాలోనే తొలిసారిగా సిమ్స్‌లో న్యూ జనరేషన్ బోన్-స్పారింగ్ హిప్ ఆపరేషన్చెన్నై నగరంలోని సిమ్స్ ఆస్పత్రి వైద్యులు తుంటి పునర్నిర్మాణంలో ఒక కొత్త మైలురాయిని నెలకొల్పారు. ఆసియాలోనే మొట్టమొదటి నూతన తరం, ఎముకను కాపాడే తుంటి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ మార్గదర్శక శస్త్రచికిత్సను ఇద్దరు అంతర్జాతీయ రోగులపై నిర్వహించారు. వారిలో ఒకరు అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన 44 ఏళ్ల వ్యక్తి కాగా, మరొకరు యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌కు చెందిన 58 ఏళ్ల రోగి. సాంప్రదాయ తుంటి శస్త్రచికిత్సలలో తరచుగా ఎముకను అధికంగా తొలగించాల్సి ఉండగా, ఈ వినూత్న విధానం రోగి యొక్క ఆరోగ్యకరమైన సహజ ఎముకలో గణనీయమైన భాగాన్ని కాపాడుతూనే, స్థిరమైన, క్రియాత్మకమైన పునర్నిర్మాణాన్ని సాధిస్తుంది. ఇది భవిష్యత్తులో తుంటి శస్త్రచికిత్సల కోసం రోగులకు మరిన్ని అవకాశాలను అందిస్తుంది.

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?

భర్త వీడియో కాల్ లిఫ్ట్ చేయలేదని భార్య ఆత్మహత్య, ప్రాణం తీసుకోవడం ఎంత తేలికైపోతుంది?అన్ని జన్మలలోకెల్ల ఉత్తమోత్తమమైనది మానవ జన్మ అంటారు. ఐతే ఏవేవో చిన్నచిన్న కారణాలతో ప్రాణాలను తీసుకుంటున్నారు. బలవన్మరణం పొందుతున్నారు. భర్తకు వీడియో కాల్ చేస్తే అతడు దానిని లిఫ్ట్ చేయలేదని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన 20 ఏళ్ల అఖిలకి రెండేళ్ల క్రితం హుస్సేన్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 5 నెలల పాప వున్నది. ప్రస్తుతం ఆమె పుట్టింటిలో వున్నది. పాప ఏడుస్తోందని, తన భర్తను వీడియో కాల్ ద్వారా మాట్లాడించాలని ఫోన్ చేసింది.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు-2026.. టీటీడీ సిబ్బంది వివరాల తనిఖీ.. క్రిమినల్ కేసులు ఉన్నాయేమో?