Author %e0%b0%a0%e0%b0%be%e0%b0%97%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d 0.html

Notifications

భార్యకు తన గుట్టు తెలిసిందని ప్రియురాలిని బండరాయితో మోది చంపేసాడు

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లుసంక్రాంతి వస్తుందంటే హైదరాబాద్ నగరం నుంచే కాక దేశంలోని వివిధ నగరాల నుంచి తెలుగు రాష్ట్రాల పల్లెలకి తెలుగువారు ప్రయాణం చేస్తుంటారు. ఈ నేపధ్యంలో దక్షిణమధ్య రైల్వే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడవనున్నాయి. డిశెంబర్ 23 నుంచి జనవరి 27 వరకూ సికింద్రాబాద్-పార్వతీపురం ప్రత్యేక రైలు ప్రతి బుధవారం నడుస్తుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, గంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం మీదుగా వెళ్తుంది. అలాగే జనవరి 10, 12, 17, 19 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?

కార్తీక సోమవారం రోజు శివుడిని, చంద్రుడిని పూజిస్తే..?కార్తీక సోమవారం రోజు నదీస్నానం చేయడం, దీప దానం ఆచరించడం విశేషమైన ఫలితాలను కలిగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ముత్తయిదువులు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే మాంగల్య భాగ్యం కలుగుతుందట. అలాగే.. శివుడిని బిల్వ దళాలతో పూజించడం వల్ల మనోభీష్టం నెరవేరుతుందని విశ్వాసం. సోమవారం చంద్రుడికి సంబంధించింది కాబట్టి చంద్రుడిని పూజించడం వల్ల కూడా మనశ్శాంతి లభిస్తుంది. కార్తీక మాసంలో వచ్చే సోమవారం అంటే కార్తీక సోమవారం అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైర రోజు. ఈ రోజున శివారాధన చేసినా, శివ నామస్మరణ చేసినా, శివుడికి అభిషేకం చేసినా విశేషమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.