గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (21:28 IST)

కమల్... పెద్దాయన రమ్మంటున్నారు వచ్చేయ్... అలా చేసుకుందాం... ఎవరు?

తమిళనాట రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాల వైపు దేశ ప్రజలే ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. పన్నీరుసెల్వం, పళణిస్వామి, దినకరన్‌ల మధ్య జరుగుతున్న మాటల యుద్థం కన్నా సినీ నటులు రాజకీయాల్లోకి రానుండటమే ఇ

తమిళనాట రాజకీయాలు రోజుకో విధంగా మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా మారిన తమిళ రాజకీయాల వైపు దేశ ప్రజలే ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. పన్నీరుసెల్వం, పళణిస్వామి, దినకరన్‌ల మధ్య జరుగుతున్న మాటల యుద్థం కన్నా సినీ నటులు రాజకీయాల్లోకి రానుండటమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ పెట్టనున్న నేపథ్యంలో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు ఆయనపైకి మళ్ళాయి. మొదట్లో రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనుకున్నా.. ఆయన రావడం ఆలస్యంగా ఉండటంతో కమల్ ముందడుగు వేసి గాంధీ జయంతికి గాని దసరాకు గాని పార్టీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే.
 
అయితే అంతలోనే కొంతమంది కమల్‌ను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కమల్ కమ్యూనిస్టులతో కలవాలన్న నిర్ణయాన్ని తీసుకుంటే ఆయనతో కలిసి నడిచేందుకు మరికొన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. కానీ కమల్ మాత్రం అందుకు ఒప్పుకున్నట్లు లేదు. అందులో ప్రధాన పార్టీ డిఎంకే. ముందు నుంచి డిఎంకే నేతలతో కమల్ హాసన్ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. డిఎంకే పార్టీకి చెందిన పత్రికా కార్యక్రమానికి కూడా కమల్ హాజరయ్యారు. స్టాలిన్, కరుణానిధిలతో మంచి సన్నిహితం కమల్‌కు ఉంది.
 
ఆ స్నేహబంధంతోనే కమల్‌తో ఫోన్ చేసి స్టాలిన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. సొంతంగా పార్టీ పెట్టొద్దని నేను చెప్పను.. కానీ.. మనం కలిసి ఉంటే బాగుంటుందని మాత్రమే నేను చెప్పగలను. నీ శ్రేయస్సు కోరే చెబుతున్నాను.. మనం కలిసి ముందుకు సాగుదాం.. ఒకరినొకరు అర్థం చేసుకుని పార్టీని నడిపిద్దామని చెప్పారట. అయితే కమల్ ముక్కుసూటి మనిషన్న విషయం తెలిసిందే. దీంతో తన స్నేహితుడిగా భావిస్తున్న స్టాలిన్ ఏం చెప్పినా అలాగే అంటూ చెప్పి కొద్దిగా సమయం ఇవ్వండి అని చెప్పి సైలెంట్ అయిపోయారట.
 
కానీ స్టాలిన్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా కమల్‌ను డిఎంకేలోకి తీసుకోవాలన్న ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదని తెలుస్తోంది. కమల్ సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఇలా తెలిసిన వారందరితోను తమ పార్టీలోకి వచ్చేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించారట. కమల్ హాసన్ ఎప్పుడూ తాను అనుకున్నదే చేస్తాడు.. వేరే ఎవరు చెప్పిన పట్టించుకోరు. అలాంటిది రాజకీయాల నుంచి సన్నిహితులు చెబితే వింటారా.. అస్సలు సాధ్యం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవేళ కమల్ డిఎంకేతో కలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే స్టాలిన్ పార్టీని నడిపిస్తుంటే ఆ పార్టీలోకి వెళ్ళిన కమల్ ఏ పదవిని తీసుకుంటాడా అన్నది చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఈ వ్యవహారాన్నంటికి మరికొన్నిరోజుల్లోనే తెరపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది.