సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ivr
Last Modified: బుధవారం, 14 సెప్టెంబరు 2016 (15:44 IST)

కూర్చున్న కొమ్మను నరుక్కునేందుకు యూపీ సీఎం అఖిలేష్ సిద్ధం... పడతావ్ రా కన్నా... తండ్రి ములాయం...

తల్లిదండ్రులు, స్నేహితులు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, తల్లీకొడుకులు, అమ్మాకూతుళ్లు, ప్రేయసీప్రియుడు... ఇలా చెప్పుకుంటే పోతే చాలా పదాలున్నాయనుకోండి. ఇంతకీ ఈ పదాల సంగతి ఇప్పుడెందుకయా అంటే... ఉత్తరప్రదేశ్ రాజకీయాలను చూసినప్పుడు ఇలాంటి పదాలు గబుక్కున

తల్లిదండ్రులు, స్నేహితులు, భార్యాభర్తలు, తండ్రీకొడుకులు, తల్లీకొడుకులు, అమ్మాకూతుళ్లు, ప్రేయసీప్రియుడు... ఇలా చెప్పుకుంటే పోతే చాలా పదాలున్నాయనుకోండి. ఇంతకీ ఈ పదాల సంగతి ఇప్పుడెందుకయా అంటే... ఉత్తరప్రదేశ్ రాజకీయాలను చూసినప్పుడు ఇలాంటి పదాలు గబుక్కున గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే వీళ్ల మధ్య గొడవలు రేగితో అవి ఓ పట్టాన చల్లారవు. ఇప్పుడదే యూపీలోనూ జరుగుతోంది.
 
తండ్రి ములాయం సింగ్ యాదవ్ పైన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ కోపం కట్టలు తెంచుకున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని స్వయంగా తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు అఖిలేష్ యాదవ్ నుంచి ఊడబెరికి తన సోదరుడు శివపాల్ కు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు అఖిలేష్ యాదవ్ ఆగ్రహంతో ఊగిపోతున్నారట. 
 
కాగా అఖిలేష్ ఆధ్వర్యంలో పార్టీ భ్రష్టు పట్టిపోతోందని తండ్రి ములాయం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనిపై అఖిలేష్ యాదవ్ మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారనీ, ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు చెపుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఆయన రాష్ట్ర గవర్నరుతో భేటీ అవుతున్నట్లు చెపుతున్నారు. ఐతే ఈ పరిణామాలపై ములాయం సింగ్ యాదవ్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. 
 
ముందస్తు ఎన్నికలకు వెళితే పార్టీ విజయావకాశాలు ఉండవనీ, అది కాంగ్రెస్, భాజపాలకు అనుకూలంగా మారుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. కూర్చున్న కొమ్మనే నరుక్కోవద్దని కుమారుడు అఖిలేష్ యాదవ్ కు సూచనలు చేస్తున్నా అఖిలేష్ అవేమీ ఖాతరు చేయడం లేదట.