1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Pregnant woman dies by suicide in Mahabubabad after lover refuses marriage

పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడు.. గర్భిణీ మహిళ ఆత్మహత్య

Pregnant
ప్రేమ పేరుతో మోసం చేశాడని.. పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు నిరాకరించడంతో ఓ గర్భిణీ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మౌనిక అనే మహిళ తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మౌనిక గత నాలుగేళ్లుగా అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో ప్రేమలో ఉంది. 
 
శ్రీకాంత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఆమె గర్భవతి అయిన తర్వాత నిరాకరించాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినప్పటికీ, ఎటువంటి పరిష్కారం లభించలేదని వారు పేర్కొన్నారు.
 
పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.  
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
2024 నుంచి 23 శాతం మేర పెరిగిన ఏఐ ఉద్యోగాల వేతనాలు