గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (18:21 IST)

హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ దారుణ హత్య

Nazar Mohammad
ఆఫ్ఘనిస్తాన్‌ కాందహార్‌ ప్రావిన్స్‌లో ఖాషా జ్వాన్‌గా ప్రసిద్ది చెందిన హాస్యనటుడు నాజర్ మొహమ్మద్ దారుణ హత్య ప్రపంచాన్ని వణికించింది. తాలిబన్లే నాజర్ మొహమ్మద్‌ను చంపారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కమెడియన్‌ నాజర్ మొహమ్మద్‌ను ఇంటి నుంచి లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారని తెలిసింది. 
 
వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ మొహమ్మద్ ఇంట్లోకి ప్రవేశించి.. గన్స్‌తో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్‌ని హత్య చేసినట్లు ప్రచురించారు. నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు కాందహార్‌ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు.
 
తాలిబన్లే ఈ దారుణానికి ఒడిగట్టారని కమెడియన్‌ కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ మాత్రం ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని ఖండించింది. అఫ్ఘనిస్తాన్‌ భద్రతా దళాలపై తాలిబాన్లు తమ దాడిని తీవ్రతరం చేశారు. 
 
ఇప్పటికే దాదాపు 70 శాతం అఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఈ దారుణం జరిగిందని భావిస్తున్నారు. కాందహార్‌లో పలు కుటుంబాలు యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల నుంచి పారిపోతున్నాయి. వీరంతా అఫ్ఘనిస్తాన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.