ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:50 IST)

ఆర్మీ మాజీ చీఫ్ తనయుడి కోసం అల్ జవహరి కుమార్తెలను విడిచిపెట్టిన పాకిస్థాన్

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది.

పాకిస్థాన్ ప్రభుత్వం మరోమారు ఉగ్రవాదుల ఒత్తిడికి తలొగ్గింది. ఫలితంగా అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ జవహరి కుమార్తెలను పాకిస్తాన్ ప్రభుత్వం విడిచిపెట్టింది. అల్‌ఖైదా ఉగ్రవాదుల చెరలో ఉన్న పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అష్ఫక్ పర్వేజ్ కయానీ తనయుడిని విడిపించుకునేందుకుగాను అల్-జవహరి ఇద్దరు కూతుళ్లను పాక్ ప్రభుత్వం విడిచిపెట్టింది. 
 
ఈ విషయాన్ని 'అల్ ఖైదా' తన మ్యాగజైన్ అల్-మస్రాలో పేర్కొంది. అయితే, ఈ ఒప్పందానికి తొలుత పాకిస్థాన్ ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ, కీలక స్థాయిలో జరిగిన సంప్రదింపుల నేపథ్యంలో ఈ ఒప్పందానికి పాక్ ప్రభుత్వం తలొగ్గాల్సి వచ్చింది.