శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (12:39 IST)

ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకల దాడి.. 30 మంది మృతి

ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ఈజిప్టులోని గజా నగరంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో 30 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గజా నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలోని బహరియ

ఈజిప్టు పోలీసులపై ఉగ్రమూకలు విరుచుకుపడ్డారు. ఈజిప్టులోని గజా నగరంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో 30 మందికి పైగా పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. గజా నగర సమీపంలోని ఎల్‌-వహాత్‌ ఎడారి ప్రాంతంలోని బహరియా ఓయాసిస్‌ వద్ద ఉగ్రవాదులు దాగి వున్నట్లు సమాచారం అందగానే పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ ప్రాంతంలో పోలీసులు, భద్రతాసిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. 
 
ఉగ్రవాదుల కాల్పులకు పోలీసులు ప్రతి కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 50 మందికి పైగా పోలీసులు, భద్రతాసిబ్బంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఎదురుకాల్పుల్లో కొందరు ముష్కరులు కూడా హతమైనట్లు ఈజిప్టు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాల్పులకు పాల్పడింది తామేనంటూ తీవ్రవాద సంస్థ హసమ్‌ ప్రకటించింది.