శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (14:05 IST)

బైకును కొట్టేయబోయాడు.. కానీ బైకును బయటికీ తీస్తూ గేటు మధ్య ఇరుక్కుపోయాడు..

ఎన్నెన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బైకు దోపీడికి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం మూడురోజుల్లో 45 లక్షల మంది తిలకించారు. ఒకవిధంగా చెప

ఎన్నెన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బైకు దోపీడికి సంబంధించిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కేవలం మూడురోజుల్లో 45 లక్షల మంది తిలకించారు. ఒకవిధంగా చెప్పాలంటే స్టార్ హీరోల సినిమాల ట్రైలర్ల రేంజ్‌లో హంగామా చేస్తోంది. మూడేళ్ల క్రితం జరిగిన ఘటన వైరల్ అయ్యింది. దాదాపు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఓ వ్యక్తి మోటారు సైకిల్‌ను దొంగతనం చేయడానికి ఓ ఇంటికి వచ్చాడు. 
 
అంతకుముందు ఫ్రెండ్‌తో కలిసి గేటు బయట రెక్కీ నిర్వహించాడు అతగాడు. ఎవరూ లేరని భావించి గేటు తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు. బైకును తీసుకుని బయటకు వస్తున్న టైంలో వాహనం గేటులో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినప్పటికీ రాలేదు. ఈలోగానే అలర్టయిన ఇంటి ఓనర్.. వేగంగా బయటకు రాగానే బైకును వదిలి యువకుడు పారిపోయాడు. ఈ తతంగమంతా సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.