సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 30 అక్టోబరు 2018 (15:04 IST)

సర్కస్‌లో నాలుగేళ్ల చిన్నారిని మింగేయాలని చూసిన సింహం.. (వీడియో)

సర్కస్ చూసేందుకు వచ్చిన చిన్నారిని సర్కస్ ఫీట్లు చేస్తున్న ఓ సింహం మింగేయాలని చూసింది. ఈ ఘటన రష్యాలోని క్రాస్ నోడార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సింహం సర్కస్ ఫీట్లు చేస్తుంది. సింహం బోనులోకి వెళ్లిన ట్రయినర్, దానితో ఫీట్లు చేయిస్తుండగా, బోను దగ్గరకు వచ్చిన ఓ పాప, చప్పట్లు కొడుతోంది.
 
సింహంతో మరో ఫీట్ చేయించే క్రమంలో దాన్ని కూర్చోబెట్టిన ట్రయినర్, ప్రేక్షకులకు ఏదో చెబుతుండగా, ఒక్కసారిగా సింహం లేచి పాపపై పంజా విసిరింది. పాపను బోనులోకి లాక్కొచ్చి తినేందుకు ప్రయత్నించగా, ట్రయినర్, ఇతర సిబ్బంది దాన్ని అదుపు చేశారు. ముఖంపై తీవ్ర గాయాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై విచారించిన అధికారులు, రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించారని తేల్చారు. సర్కస్ డైరెక్టర్‌ను తొలగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.