శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 ఆగస్టు 2017 (13:57 IST)

పెళ్లికి ముందే ముద్దూ ముచ్చట.. కోర్టు ముందు ప్రేమజంట.. ఎక్కడ?

అబుదాబిలో ఓ ప్రేమ జంట న్యాయమూర్తి ముందు వాదనకు దిగింది. పెళ్లికి ముందే శారీరక సంబంధం, ముద్దులు పెట్టుకోవడం వంటివి ఆ దేశంలో నేరం. అయితే 32 ఏళ్ల మహిళ యూఏఈలోని అబుదాబి నగరంలో ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉంట

అబుదాబిలో ఓ ప్రేమ జంట న్యాయమూర్తి ముందు వాదనకు దిగింది. పెళ్లికి ముందే శారీరక సంబంధం, ముద్దులు పెట్టుకోవడం వంటివి ఆ దేశంలో నేరం. అయితే 32 ఏళ్ల మహిళ యూఏఈలోని అబుదాబి నగరంలో ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటోంది. అదే దేశానికి చెందిన ఓ వ్యక్తితో శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం బయటపడటంతో యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పెళ్లి కాకుండానే ఓ వ్యక్తికి ముద్దు పెట్టడంతో.. లైంగిక సంబంధాలు పెట్టుకోవడం తప్పని కోర్టు ఆ యువతిని నిలదీసింది. పెళ్లికి ముందే ఇవన్నీ తప్పుకాదా అంటూ ఆమెను ప్రశ్నించింది. దీంతో తనకు తెలియదని యువతి సమాధానం చెప్పింది. తెలియదని చెప్పడానికి గల ఆధారాలను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కేసును సెప్టెంబర్ 6కు వాయిదా వేశారు. 
 
ఇదే తరహాలో ఓ జంటపై కోర్టు ముందు హాజరైంది. పెళ్లి కాకుండానే ముద్దుపెట్టుకున్నారనే కారణంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. తాము తప్పు చేయలేదని ఆ జంట వాదిస్తుంది. అయితే పెళ్లికి ముందు ముద్దుపెట్టుకోలేదనడానికి సాక్ష్యం కావాలని కోర్టు తెలిపింది. తప్పు చేయలేదనే ఆధారాలను కోర్టుకు సమర్పించాలని, కేసును సెప్టెంబర్ 6కు వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.