గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 25 జులై 2017 (17:23 IST)

150 అమ్మాయిల్లో నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు.. రోజు కొకరు... 6 నెలల పాటు అత్యాచారం

ఐసిస్ ప్రభావం తగ్గిపోతున్న వేళ.. వారి నుండి తప్పించుకున్న మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. ముఖ్యంగా యాజీదీ మహిళలను ఐసిస్ తీవ్రవాదులు ఎంతగా హింసించేవారో బయట పెడుతున్నారు. సెక్స్ బానిసలు

ఐసిస్ ప్రభావం తగ్గిపోతున్న వేళ.. వారి నుండి తప్పించుకున్న మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెడుతున్నారు. ముఖ్యంగా యాజీదీ మహిళలను ఐసిస్ తీవ్రవాదులు ఎంతగా హింసించేవారో బయట పెడుతున్నారు. సెక్స్ బానిసలుగా మార్చుకొని తమను చిత్ర హింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏక్లాస్ అనే యువతి 14ఏళ్ల వయస్సులోనే ఐసిస్ టెర్రరిస్టులకు చిక్కుకుంది.
 
ఏక్లా‌స్ ‌కూడా కిడ్నాప్ గురైంది. మోసుల్ నగరానికి ఐసిస్ రాక్షసులు ఆమెను ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన 2014 ఆగస్ట్ లో చోటుచేసుకుంది. ఏక్లాస్ తప్పించుకోడానికి ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. ఆమెను సెక్స్ బానిసగా మార్చేశారు. తనను తాము చంపేసుకోవాలని భావించినప్పటికీ వీలుపడలేదని, దాదాపు ఆరు నెలల పాటు.. ప్రతి రోజూ తనను ఎవరో ఒకరు అత్యాచారం చేసేవారని ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఏక్లాస్ ప్రస్తుతం జర్మనీలో థెరపీ తీసుకుంటోంది. తాను లాయర్ కావాలని కోరుకుంటున్నట్లు ఏక్లాస్ తెలిపింది.
 
150 మంది అమ్మాయిలలో ఓ వ్యక్తి వచ్చి తనను తనను సెలెక్ట్ చేసుకున్నాడని ఏక్లాస్ తెలిపింది. అతను చాలా వికృతంగా, పొడవుగా ఉన్నాడని..తాను అతన్ని చూడడానికి కూడా భయపడేదాన్నని చెప్పింది. ఓ రోజు అతను బయటకు వెళ్ళినప్పుడు తాను తప్పించుకొని బయటకు వచ్చేశానని ఏక్లాస్ వెల్లడించింది.