నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారు... ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపండి.. షరీఫ్ ఆదేశాలిచ్చారా?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనా
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కన్నెర్రజేస్తున్నారనీ, అందువల్ల ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేసినట్టు పాక్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అదీ కూడా 'అసాధారణ మార్పు' అనే పేరుతో ఈ కథనాన్ని ప్రచురించి పెద్ద చర్చకే తెరలేపింది.
ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మద్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేయడానికి పూనుకుందని తెలిపింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవలే రహస్య సమావేశం నిర్వహించారని, అందులో ఈ అంశంపై ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారని ఆ పత్రికా కథనంలో పేర్కొంది.
ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే అందులో ఆ దేశ జవాన్ల ఆధ్వర్యంలోని నిఘా సంస్థలు కల్పించుకోకూడదని షరీఫ్ చెప్పినట్లు పాక్ పత్రిక పేర్కొంది. యురీ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా.. ఈ దాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్థాన్ దోషిగా నిలబడింది. దీంతో నవాజ్ షరీఫ్ ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.