శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 జులై 2017 (14:55 IST)

ఆ కవలలు డిజిటల్ ట్విన్స్...

బ్రిటన్‌లో ఓ డిజిటల్ తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా విధానం ద్వారా జన్మనిచ్చిన తొలి తల్లిగా ఆమె రికార్డు సాధించింది. ఆమె పేరు మలావస్త్ ధురి (37). ఈమె డిజిటల్‌ గ్రోత్‌ చార్ట్‌ సాయంతో జన్మనిచ్చ

బ్రిటన్‌లో ఓ డిజిటల్ తల్లి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ తరహా విధానం ద్వారా జన్మనిచ్చిన తొలి తల్లిగా ఆమె రికార్డు సాధించింది. ఆమె పేరు మలావస్త్ ధురి (37). ఈమె డిజిటల్‌ గ్రోత్‌ చార్ట్‌ సాయంతో జన్మనిచ్చింది. ఈ మహిళ భారతీయ సంతతికి చెందిన మహిళ కావడం గమనార్హం. 
 
గర్భంలో కవలల ఆరోగ్య పరిస్థితి, పెరుగుదలను తెలుసుకునేందుకు 10 వేల స్కాన్‌లను ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసిన ఈ డిజిటల్‌ చార్టు కోసం యూకేకు చెందిన ట్విన్స్‌ అండ్‌ మల్టిపుల్‌ బర్త్స్‌ అసోసియేషన్‌ విరాళం ఇచ్చింది. ఇప్పటివరకు ఉన్న చార్టులతో కవలల్లో పెరుగుదలను కచ్చితంగా గుర్తించలేమన్నారు. 
 
ప్రసవం ముందుగా చేయాల్సి వచ్చి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సెయింట్‌ జార్జ్‌ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. డిజిటల్‌ చార్టులైతే గర్భంలోని శిశువుల పెరుగుదలను ఖచ్చితంగా నిర్ధారిస్తాయని చెప్పారు. దీంతో ఆ విధానం పర్యక్షణలో ఆ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది.