శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 3 నవంబరు 2016 (12:42 IST)

ఇరాక్ ద‌ళాల ఉచ్చులో ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీ? ఐసిస్‌ను అంతం చేస్తారా?

ఇరాక్ : ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని ఇరాక్‌ దళాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఐసిస్‌కు పట్టున్న మోసుల్‌ ప్రాంతానికి దాదాపు రెండేళ్ల తర్వాత ఇరాకీ దళాలు చేరుకోగలిగాయి. దీనిపై స్పందించిన కుర్దీ

ఇరాక్ : ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బాగ్దాదీని ఇరాక్‌ దళాలు చుట్టుముట్టినట్లు సమాచారం. ఐసిస్‌కు పట్టున్న మోసుల్‌ ప్రాంతానికి దాదాపు రెండేళ్ల తర్వాత ఇరాకీ దళాలు చేరుకోగలిగాయి. దీనిపై స్పందించిన కుర్దీష్‌ అధ్యక్షుని ప్రధాన అధికారి ఫాయిద్‌ హుస్సేన్ మాట్లాడుతూ, ఆ ప్రాంతంలోనే బాగ్దాదీ ఉన్నట్లు పక్కా సమాచారముందని, అతడిని అంతమొందించగలిగితే ఐసిస్‌ వ్యవస్థ మొత్తం పతనమవుతుందని వ్యాఖ్యానించారు. 
 
బాగ్దాదీ గత తొమ్మిది నెలలుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఒకవేళ బాగ్దాదీ హతమైనా ఐసిస్‌ మరో నేతను ఎన్నుకుంటుంది. కానీ, వాళ్లు కచ్చితంగా ఓడిపోతారని, అయితే అది ఎప్పటిలోగా జరుగుతుందో చూడాలని ఫాయిద్ అంటున్నారు. గతంలోనూ బాగ్దాదీ హతమైనట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో ఆ దాడుల నుంచి బాగ్దాదీ సురక్షితంగా బయటపడ్డాడు. ఈసారి మాత్రం త‌ప్పించుకోలేడ‌ని చెపుతున్నారు.