సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 అక్టోబరు 2016 (08:52 IST)

ఎల్‌వోసీ వద్దకు భారీగా పాకిస్థాన్ బలగాల మొహరింపు.. యుద్ధం తప్పదా?

భారత్, పాకిస్థాన్ దేశాల అంతర్జాతీయ నిత్రణరేఖ వద్ద పాకిస్థాన్ భారీ ఎత్తున బలగాలను మొహరిస్తోంది. అదేసమయంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయిస్తోంది.

భారత్, పాకిస్థాన్ దేశాల అంతర్జాతీయ నిత్రణరేఖ వద్ద పాకిస్థాన్ భారీ ఎత్తున బలగాలను మొహరిస్తోంది. అదేసమయంలో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయిస్తోంది. 
 
పంజాబ్‌, కాశ్మీర్‌లో ఎల్‌వోసీ పొడవునా భారత సైన్యం పెద్ద ఎత్తున మోహరించిన మాదిగారే పాకిస్థాన్‌ తన సైన్యాన్ని ఆవలి వైపు మోహరిస్తోంది. దీంతో నియంత్రణ రేఖ పొడవునా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఎల్‌వోసీ వెంబడి ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలకు చెందిన లాంచ్‌ప్యాడ్‌లను పాకిస్థాన్‌ సైన్యం ఇప్పటికే పీవోకే నుంచి ఆర్మీ బేస్‌ల్లోకి తరలించింది. ఓవైపు ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూనే మరోవైపు సుమారు 100 మందికిపైగా ఉగ్రవాదులను భారతలోకి పంపించేదుకు పాక్‌ సన్నాహాలు చేస్తోంది. 
 
అదేసమయంలో పాక్‌ బలగాలు కవ్వింపు చర్యల్లోనూ ఏమాత్రం తగ్గడం లేదు. సర్జికల్‌ దాడులు జరిగిన నాటి నుంచి పాక్‌ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద 25 సార్లు కాల్పులకు పాల్పడ్డాయి.