శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (11:35 IST)

లవ్ గురుగా మారిన పాకిస్థాన్ ప్రధాని.. 82 ఏళ్లలో కూడా పెళ్లి చేసుకోవచ్చట..

Pakistan PM
Pakistan PM
పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ లవ్ గురుగా అవతారం ఎత్తారు. 52ఏళ్ల వయస్సులోనూ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చా అని ఓ పౌరుడు అడిగిన ప్రశ్నకు అన్వర్ ఇలా సమాధానం ఇచ్చారు. 
 
82 ఏళ్ల వయసులోనూ నచ్చిన మహిళను పెళ్లి చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన జీవితంలో ఎవరినీ ఆకర్షించడానికి ప్రయత్నించలేదని, అయితే తాను చాలా మందిని ఆకట్టుకున్నానని అన్వర్ ఉల్ హక్  వెల్లడించారు.
 
విదేశాల్లో ఉద్యోగం వచ్చి ప్రేమను వదులుకోవాల్సి వస్తే ఏం చేయాలని అడిగినప్పుడు.. అనుకోకుండా ప్రేమను పొందవచ్చు.. మీ సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగం పొందారని నేను అనుకుంటున్నాను. అవకాశాన్ని వదులుకోవద్దు.. అని కాకర్ స్పందించారు.
 
పాకిస్తాన్ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.  ఇలాంటి సమయంలోనే ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను పర్యవేక్షించడానికి పాక్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్-హక్ కాకర్‌ను ఎంపిక చేశారు. పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి.