సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (20:18 IST)

గిల్గిత్‌-బాల్టిస్తాన్‌కు ప్రాంతీయ హోదా.. పాకిస్థాన్ సర్కారు కీలక నిర్ణయం

Gilgit-Baltistan
చైనాను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా భారీ నిరసనల మధ్య పాకిస్తాన్‌‌లోని ఇమ్రాన్‌ఖాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య వివాదాస్పద ప్రాంతమైన గిల్గిత్‌-బాల్టిస్తాన్‌కు పాకిస్తాన్‌ ప్రభుత్వం తాత్కాలిక ప్రాంతీయ హోదా ప్రకటించింది. 
 
యుఎన్ఎస్సీ తీర్మానానికి అనుగుణంగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ తాత్కాలిక ప్రాంతీయ హోదాను ఇవ్వాలని మేం నిర్ణయించుకున్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. పాకిస్తాన్ పటం నుంచి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) తోపాటు గిల్గిత్, బాల్టిస్తాన్లను సౌదీ అరేబియా తన ప్రత్యేక కరెన్సీ నోటు పైనుంచి తొలగించిన తరువాత తాత్కాలిక ప్రాంతీయ హోదా ఇవ్వాలనే విషయం తెరపైకి వచ్చింది.
 
గిల్గిత్-బాల్టిస్తాన్ భారతదేశంలో భాగమైన జమ్ముకాశ్మీర్‌లో భాగం. పాకిస్తాన్ ఏమైనా చట్టపరమైన అనుమతి లేకుండా చేస్తుంది. అలాగే, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌పై భారతదేశం పూర్తి హక్కును కలిగి ఉంది. 
 
దీనిని ప్రావిన్స్‌గా మార్చడం లేదనేది భారతదేశపు సంపూర్ణ స్థానం. అది ఇప్పటికీ భారత భూభాగంగానే ఉంటుంది. పాకిస్తాన్‌కు దానిపై హక్కు ఏమాత్రం లేదు. పాకిస్తాన్ తీసుకున్న ఈ నిర్ణయానికి భారత ప్రభుత్వం ఖచ్చితంగా నిరసన తెలుపుతుందని నిపుణులు భావిస్తున్నారు.