శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 9 ఆగస్టు 2017 (10:08 IST)

రన్ వే మీద కాకుండా రోడ్డు మీద టేకాఫ్... వ్యాన్‌ను ఢీకొట్టిన విమానం (వీడియో)

రన్‌వే మీద కాకుండా రోడ్డు మీద విమానం టేకాఫ్ అయ్యింది. ఆ విమానం ఆకాశంలో ఎగిరిందా.. అనే డౌట్ మీలో వుంది కదూ.. అయితే చదవండి. అవును రన్ వే కాకుండా రోడ్డుపై ఎగరాలనుకున్న విమానం ప్రమాదానికి గురైంది.

రన్‌వే మీద కాకుండా రోడ్డు మీద విమానం టేకాఫ్ అయ్యింది. ఆ విమానం ఆకాశంలో ఎగిరిందా.. అనే డౌట్ మీలో వుంది కదూ.. అయితే చదవండి. అవును రన్ వే కాకుండా రోడ్డుపై ఎగరాలనుకున్న విమానం ప్రమాదానికి గురైంది.

రోడ్డు మీద టేకాఫ్ చేయ‌డానికి పైల‌ట్ ప్ర‌య‌త్నించ‌డంతో అదే రోడ్డు మీద వెళ్తున్న వ్యాన్‌ను వెన‌క నుంచి ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో వ్యాన్ డ్రైవ‌ర్‌తో పాటు, పైల‌ట్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 
 
అలాగే ఈ విమానం టేకాఫ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన పైల‌ట్‌కి లైసెన్స్ కూడా లేద‌ని పోలీసులు తెలియ‌జేశారు. ర‌ష్యాలోని చెచ‌న్యా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్ట‌ర్‌లో వైరల్ అవుతోంది.