సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 13 జులై 2017 (15:14 IST)

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్క

సోషల్ మీడియా ప్రభావం, యూట్యూబ్ మహాత్యం కారణంగా ఏ చిన్న ఘటన జరిగినా అది వీడియో రూపంలో నెట్టింట్లోకి వచ్చేస్తోంది. ప్రాణాలతో వున్న కోళ్ళను, మేకలను మాంసం కోసం మెడ కత్తిరించేటప్పుడు.. అవి రెండు, మూడు నిమిషాల పాటు విలవిల్లాడటం.. ఆపై ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు గ్రామాల్లో చూసేవుంటాం. ఇలాంటి సీనే జపాన్‌లో జరిగింది. అయితే అక్కడ చేప రెండు ముక్కలైనప్పటికీ చావలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 
 
వివరాల్లోకి వెళితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా దట్టించి వండేందుకు సిద్ధం చేయాలనుకున్నారు. చేపను తీసుకొచ్చి బతికుండగానే నిలువుగా కోశారు. ఆ చేపను నిలువుగా రెండు ముక్కలు చేసినప్పటికీ అది పైకి ఎగురుతూ.. కనిపించింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండు నిమిషాల పాటు కొట్టుకున్న ఆ చేప.. చివరకు ప్రాణాలు విడిచింది. ఈ వీడియోను మీరూ చూడండి