వారంలో పెయిడ్ సెక్స్ అవర్.. స్వీడెన్ మున్సిపాలిటీ యంత్రాంగం ప్రకటన
స్వీడెన్లోని ఓ మున్సిపాలిటీ యంత్రాంగం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. మున్సిపాలిటీ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఒక గంట పాటు శృంగార సెలవును ప్రకటించాలని స్వీడన్లోని ఓవర్టోర్నియా కౌన్సిల్ మేన
స్వీడెన్లోని ఓ మున్సిపాలిటీ యంత్రాంగం కొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. మున్సిపాలిటీ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఒక గంట పాటు శృంగార సెలవును ప్రకటించాలని స్వీడన్లోని ఓవర్టోర్నియా కౌన్సిల్ మేన్ పెర్ ఎరిక్ ఇచ్చిన సూచన మేరకు స్వీడెన్ మున్సిపాలిటీ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వారానికి శృంగార సెలవును ఇవ్వాలని అందుకు పెయిడ్ సెక్స్ అవర్గా పేరు పెట్టాలని కూడా నిర్ణయించింది.
ఈ సెలవు ప్రకారం.. పనివేళల్లో ఒక గంట పాటు చేసే పనులను పక్కనబెట్టి.. ఇంటికి వెళ్ళి భాగస్వామితో శృంగారంలో పాల్గొనవచ్చునని మున్సిపాలిటీ యంత్రాంగం తెలిపింది. తద్వారా మున్సిపాలిటీ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు ఇది సహకరిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
శృంగారంతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చునని.. అదో గొప్ప వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు సైతం సూచించిన తరుణంలో.. భాగస్వామ్యులు ఏకాంతంగా గడిపేందుకు ఈ గంట ఉపయోగపడుతుందని.. బర్త్ రేటును పెంచేందుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.