శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 15 ఏప్రియల్ 2017 (17:24 IST)

రేప్ చేస్తాడు... మహిళ తల తీసి నగ్నంగా... అతడి భార్య మరొకడితో....

వాడొక మృగం. ఐతే 2000 సంవత్సరం వరకూ ఎంతో బాధ్యాతాయుతంగా ఉద్యోగం చేసి ఆ తర్వాత తన చేతికి చిక్కిన మహిళలను రేప్ చేయడం, హత్య చేయడం, ఆ తర్వాత వారి శరీరం నుంచి తలను వేరు చేసి నగ్న దేహాలను విసిరేయడం... ఇదీ ఆ కామాంధుడు రాక్షసత్వం.

వాడొక మృగం. ఐతే 2000 సంవత్సరం వరకూ ఎంతో బాధ్యాతాయుతంగా ఉద్యోగం చేసి ఆ తర్వాత తన చేతికి చిక్కిన మహిళలను రేప్ చేయడం, హత్య చేయడం, ఆ తర్వాత వారి శరీరం నుంచి తలను వేరు చేసి నగ్న దేహాలను విసిరేయడం... ఇదీ ఆ కామాంధుడు రాక్షసత్వం. వివరాల్లోకి వెళితే...
 
రష్యాకు చెందిన 53 ఏళ్ల సీరియల్ కిల్లర్ మిఖాయిల్ పాప్‌కోవ్‌కు 22 మంది మహిళలను పొట్టనబెట్టుకున్నందుకు 2015లో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఐతే శిక్ష పడిన తర్వాత కూడా అతడి దారుణాలు వెలుగుచూడటంతో డిటెక్టివ్‌లు షాక్ తింటున్నారు. వాడు చంపిన మహిళల సంఖ్య 22 కాదు 82 అంటున్నారు వారు. ఇంతకీ వీడిలా ఎందుకు మారాడని ఆరా తీస్తే, వారికి ఒకే కారణం తెలిసిందట.
 
అదేమిటంటే... అతడి భార్య మరొకడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమేనంటున్నారు. ఆ కారణం చేత మహిళలపై కసి పెంచుకుని ఉన్మాదిగా మారిపోయాడు ఈ కామాంధుడు. తనకున్న కారులో రోడ్డుపై వెళుతుంటాడు. వీడి టార్గెట్ 17 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు వున్న మహిళలే. దాంతో ఎక్కడో ఒక దగ్గర పార్టీలు జరుగుతుంటే కారు ఆపేసి వెయిట్ చేస్తుంటాడు. పార్టీ ముగిశాక ఒంటరిగా వస్తున్న మహిళను టార్గెట్ చేస్తాడు. ఎటు వెళుతున్నారంటూ చాలా మంచివాడిలా అడుగుతాడు. 
 
వారు సమాధానం చెప్పగానే తను కూడా అటే వెళుతున్నానంటూ కారులో ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత కొద్ది దూరం వెళ్లాక నిర్మానుష్య ప్రాంతంలో కారాపి అకస్మాత్తుగా మహిళపై దాడి చేస్తాడు. ఆ తర్వాత ఆమెపై రేప్ చేసి హత్య చేస్తాడు. అనంతరం ఆమె తలను వేరు చేసి మృత దేహాన్ని రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి వెళ్లిపోతాడు. 2000 సంవత్సరం నుంచి 2015 వరకూ, అంటే 15 ఏళ్లపాటు ఇదే వాడికి పని. 
 
ఎంతమందిని చంపావు అని అడిగితే... సంఖ్య తనకు గుర్తు లేదనీ, కానీ తనకు గుర్తున్నంతవరకూ ఎక్కువమందినే అలా చేసి వుంటానని తాపీగా కోర్టులో చెప్పాడీ కామాంధుడు. ఐతే డిటెక్టివ్ విచారణలో ఇదే తరహాగా బలైన మహిళల సంఖ్య 80 మందికి పైగా వున్నట్లు తేలింది. ఇవన్నీ అతడే చేసివుంటే ప్రపంచంలోనే మహిళలను రేప్ చేసి చంపిన కామాంధుడిగా రికార్డుకెక్కుతాడంటున్నారు. ఐతే 60 మందిని ఇతడే చంపాడా లేదా అన్నది ఈ వారంలో తేలనుంది.