ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 17 మే 2017 (13:49 IST)

అమెరికా వెన్నులో వణుకు... డోనాల్డ్ ట్రంప్‌కు కిమ్ జాంగ్ ఉన్ షాక్... అణు పరీక్ష సక్సెస్

అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ప్రపంచాన్ని వణికించి, పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికాకు ఉత్తర కొరియా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన ఉత్తరకొరియా నియంత

అమెరికా వెన్నులో వణుకు మొదలైంది. ప్రపంచాన్ని వణికించి, పెద్దన్నగా చెలామణి అవుతున్న అమెరికాకు ఉత్తర కొరియా చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు షాకిచ్చిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్.. తాజాగా అమెరికా హెచ్చరికలను తోసిరాజని అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. దీంతో అమెరికా దిగివచ్చింది. 
 
తొలుత చైనాను ప్రయోగించి ఉత్తరకొరియాను దారికి తెచ్చుకుందామని ట్రంప్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పైగా, అణుపరీక్ష నిర్వహించి షాక్ ఇచ్చింది. దీంతో తమ మాటకు ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ విలువ ఇవ్వడని భావించి, నేరుగా దక్షిణ కొరియాను రంగంలోకి దించారు. చర్చలను పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణకొరియా తాజాగా ప్రకటన విడుదల చేసింది. 
 
అయితే అందుకు అణు సామర్ధ్యం కలిగిన క్షిపణి పరీక్షలను మానుకోవాలని షరతు విధించింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఉత్తరకొరియాతో టూ-ట్రాక్‌ పాలసీని అవలంభించాలని భావిస్తున్నట్లు ఈ ప్రకటనలో దక్షిణ కొరియా తెలిపింది. అయితే మిత్ర దేశమైన చైనా చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పట్టించుకోని ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ శత్రుదేశమైన దక్షిణ కొరియా చేసిన ప్రకటనను పరిగనణలోకి తీసుకుంటాడా? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.