శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (14:50 IST)

హ్యాపీ న్యూస్ : ఇంటి వద్దకే జియో సిమ్ కార్డులు.. సిద్ధమవుతున్న స్నాప్‌డీల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించినట్టుగానే జియో సిమ్ కార్డులను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో రిలయన్స్ జియో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించినట్టుగానే జియో సిమ్ కార్డులను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నారు. ఇందుకోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్‌తో రిలయన్స్ జియో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ కింద ఈ సిమ్ కార్డులను ఇంటికి డెలివరీ చేయనున్నారు. అయితే, ఇందుకోసం సిమ్ కార్డు కావాలనుకునే మొబైల్ వినియోగదారుడు.. తొలుత తమ వివరాలను స్నాప్‌డీల్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
స్నాప్‌డీల్ జియో సిమ్ హోమ్ డెలివరీ సర్వీసులో వివరాలు నమోదుచేసుకున్న అనంతరం యూజర్లకు డెలివరీ టైమ్, ప్రోమోకోడ్‌తో ఓ మెసేజ్‌ను పొందుతారు. రిలయన్స్ జియో సిమ్‌ను వెంటనే యాక్టివేట్ చేసుకోవాలనుకునే కస్టమర్లు, ప్రోమోకోడ్‌ను, ఆధార్ నెంబర్‌ను స్నాప్‌డీల్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో పంచుకుంటే వెంటనే సిమ్ యాక్టివేట్ ప్రక్రియ కూడా తక్షణం జరిగిపోతుంది. 
 
దీనికి సంబంధించి ఇప్పటికే స్నాప్ డీల్ తన కస్టమర్లకు ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించిందని, సిమ్ కార్డులను ఇంటింటికి డెలివరీ చేయనున్నామని తెలిపినట్టు తెలిసింది. స్నాప్‌డీల్ నుంచి ఈ-మెయిల్స్ అందిన కస్టమర్లు ఎలాంటి చెల్లింపులు అవసరం లేకుండా జియో సిమ్ కార్డును ఇంటివద్దే పొందవచ్చు. అలాగే, సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి చార్జీలు చెల్లించనవసరం లేదట.