1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
  4. YouTube to Release New App for Kids

చిన్నారుల కోసం ప్రత్యేక యాప్.. యూట్యూబ్ ప్రారంభం..!

YouTube to Release New App for Kids
సామాజిక మాధ్యమాల్లో వీడియో షేరింగ్ సేవలందిస్తున్న వెబ్ సైట్ యూట్యూబ్ తాజాగా చిన్న పిల్లల కోసం కొత్త యాప్‌‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న యూట్యూబ్‌లో అసభ్య వీడియోలు ఉన్నాయని పలువులు అభ్యంతారాలను వ్యక్తం చేశారు. దీంతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను ఏర్పాటు చేయాలని యూట్యూబ్ నిర్ణయించింది. 
 
అందులో భాగంగా రూపొందించిన కొత్త యాప్‌ను సోమవారం ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధి బెన్ యెర్ ప్రకటించారు. తద్వారా చదువు, విజ్ఞానం, ఆటలకు సంబంధించిన వీడియోలు ఈ కొత్త పిల్లల యూట్యూబ్ యాప్‌లో అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. 
About Writer
CVR