శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2019
Written By
Last Updated : బుధవారం, 22 మే 2019 (13:23 IST)

ఖమ్మం లోక్‌సభ ఎన్నికలు 2019 లైవ్ రిజల్ట్స్

[$--lok#2019#state#telangana--$]
 
ప్రధాన ప్రత్యర్థులు: నామా నాగేశ్వర రావు (తెరాస) వర్సెస్ రేణుకా చౌదరి (కాంగ్రెస్)
 
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. గత 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పువ్వాడ అజయ్ కుమార్  విజయం సాధించారు. కాగా ఈ 2019 ఎన్నికల్లో నామా నాగేశ్వర రావు తెరాస నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి బరిలోకి దిగారు. 
[$--lok#2019#constituency#telangana--$]
 
2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత పువ్వాడ అజయ్ కుమార్‌కు 70,251 ఓట్లు నమోదు కాగా, టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుకు 64,642 ఓట్లు పోల్ అయ్యాయి.
 
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఈసారి హేమాహేమీలు పోటీ పడుతున్నారు. తెరాస నుంచి కల్వకుంట్ల కవిత, బి. వినోద్ కుమార్, పి. దయాకర్, నామా నాగేశ్వర రావు తదితరులు పోటీలో వున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్, మధుయాష్కి గౌడ్, ఎ. రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరి తదితరులు బరిలో వున్నారు.