రాజమౌళి నిర్మాణంలో ఫాంటసీ చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ డేట్ ఫిక్స్
Don't trouble the trouble.
చిత్రానికి శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలసి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ తర్వాత మేకర్స్ కేకు వాకు అనే వీడియో సాంగ్‌కు ఆడియెన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తే ఫహాద్ ఫాజిల్ మెట్లపై కూర్చుని ఉన్నారు. తన పక్కనే చిన్న పాప స్సారా కూర్చుని ఉంది. ఆమె ఓ కలర్ స్టిక్‌ను పట్టుకుని ఇంద్రజాలం చేస్తోంది. డబ్బు వర్షంలా కురుస్తుంది. దాన్ని చూసిన ఫహాద్ ఆనందంతో ఆశ్చర్యపోతున్నారు. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం అక్టోబర్2, 2026న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
