సంబంధిత వార్తలు
- Pregnant Woman: గర్భిణీపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని రైలు నుంచి తోసేశాడు..
- చదువుకోసం స్కూలుకు పంపితే.. మీ టీచర్లు గర్భవతిని చేశారు.. హెచ్ఎం వద్ద ఓ తల్లి ఆవేదన
- మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?
- కాలేజీ బాత్రూమ్లో విద్యార్థిని ప్రసవం.. యూట్యూబ్ వీడియో చూసి బొడ్డు కత్తిరింపు
- Jayalalithaa: దివంగత సీఎం జయలలిత ఆస్తులన్నీ ఇక తమిళనాడు సర్కారుకే
Dhanvantari : ఆరోగ్యప్రదాత.. ధన్వంతరి జీవ సమాధి ఎక్కడుందో తెలుసా..?
Dhanvantari
ముఖ్యంగా తమిళనాడులోని వైతీశ్వరన్ ఆలయంలో చాలాకాలం తపస్సు చేసి అక్కడే ధన్వంతరి జీవ సమాధి అయినట్లు పురాణాలు చెప్తున్నాయి. ధన్వంతరిని స్తుతించడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని విశ్వాసం. అందుకే ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఆయన నామాన్ని 108 సార్లు పఠించాలి.
ధ్యానం కోసం సరైన ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ధన్వంతరి ఫోటోను ఉంచి, నేతి దీపం వెలిగించాలి. ధన్వంతరి సిద్ధ పురుషుడిని పూజించేటప్పుడు పునర్వసు నక్షత్రాన్ని ఎంచుకోవచ్చు. ధన్వంతరి జీవితకాలం దాదాపు 800 సంవత్సరాల 32 రోజులు. అతనికి వందలాది మంది శిష్యులు, నంది గురువుగా ఉన్నారు. సూర్యుని 16 శిష్యుల్లో ధన్వంతరి ఒకరు. కర్మానుసారం ఒక వ్యక్తి తమలో సంభవించే అనారోగ్యం నుండి బయటపడటానికి ధన్వంతరిని పూజించవచ్చు.
ఆయన రాసిన వివిధ పుస్తకాలలో, అత్యంత ప్రసిద్ధమైనవి ధన్వంతరి వైద్యచింతామణి, ధన్వంతరి దండగం. ఆయన పుస్తకాలలోని వైద్య చిట్కాలు ఒక వ్యక్తి జీవిత కాలాన్ని పొడిగించగలవు.
ఓం నమో భగవతే వాసుదేవాయ!
ధన్వంతరయే అమృత కలశ హస్తాయ
వజ్ర జలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ
త్రైలోక్య నాథాయ శ్రీ మహా విష్ణవే నమః అంటూ ఆ ధన్వంతరిని ప్రార్థిస్తే ఆరోగ్యానికి లోటుండదు. దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి.
