సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (09:15 IST)

తెలంగాణ వాహనాల నంబర్ ప్లేట్లలో 'టీఎస్' నుంచి 'టీజీ'గా మార్చుకోవాలా?

registration number code
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ఒక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఆ రాష్ట్రంలోని వాహనాల నంబర్ ప్లేట్లపై 'టీఎస్' అంటూ రాస్తూ వ
చ్చారు. అయితే, గత పదేళ్లుగా ఇదే తరహాలో నంబర్ ప్లేట్లపై రాస్తున్నారు. అయితే, ఇపుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం "టీఎస్' అక్షరాల స్థానంలో కొత్తగా "టీజీ" అనే అక్షరాలు రాయాలని నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చుకోవాలా? అని సందేహం ప్రతి ఒక్క వాహనదారుడికి ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో రవాణా శాఖకు అధికారులు నంబర్ మార్పుపై స్పష్టత ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఉన్న నంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. జీవో ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చే వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. గతంలో రాష్ట్ర విభజన నేపత్యంలోనూ ఏపీ నుంచి టీఎస్‌గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు మాత్రం యధావిధిగా కొనసాగాయని, ఇపుడూ అదే పద్ధతిని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. 
 
నటి శ్రీదేవి మరణంపై నిజాలు దాచాయంటున్న మహిళ... సీబీఐ చార్జిషీటు 
 
అందాల నటి శ్రీదేవి మృతిపై భారత్, యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచాయని భువనేశ్వర్‌కు చెందిన దీప్తి పిన్నిటి అనే మహిళ ఆరోపించింది. పైగా, శ్రీదేవి మృతిపై ఆమె సొంతంగా దర్యాప్తు కూడా జరిపి, భారత్, యూఏఈలు నిజాలు దాచాయంటూ నకిలీ పత్రాలు సృష్టించారు. దీనిపై కేంద్రం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. విచారణ జరిపి చార్జిషీటును తయారు చేసి దాఖలు చేసింది. ఈ విషయాన్ని సీబీఐ ఆదివారం వెల్లడించింది. ఈ పరిణామంపై దీప్తి స్పందించారు. తన వాంగ్మూలం నమోదు చేయకుండానే సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు. 
 
కాగా శ్రీదేవి మరణంపై దీప్తి నకిలీ పత్రాలను సృష్టించింది. ఆమె మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా ప్లాట్‌పామ్స్ చర్చలు జరిపారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవి మరణంపై దీప్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఏఈ - భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచిపెట్టాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు, యూఏఈ ప్రభుత్వ డాక్యుమెంట్ల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి ఇవే సాక్ష్యాలు అంటూ ప్రదర్శించారు. 
 
దీంతో కేంద్రం ఆదేశంతో రంగంలోకి దిగిన సీబీఐ దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. ఇవన్నీ నకిలీ పత్రాలంటూ ముంబైకి చాందినీ షా అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా శ్రీదేవి 2018లో దుబాయ్‌లో చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవికి భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.