బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (16:07 IST)

తెలంగాణ బస్సుల్లో క్యూఆరో కోడ్ చెల్లింపులు... చిల్లర సమస్యకు బైబై

qrcode
తెలంగాణ బస్సుల్లో టికెట్ కొనుగోలు చేసే స‌మ‌యంలో చిల్ల‌ర విష‌యంలో త‌లెత్తే స‌మ‌స్య‌కు ఇక‌పై చెక్ ప‌డ‌నుంది. టీజీఎస్ఆర్‌టీసీ ప్ర‌యాణికుల కోసం త్వ‌ర‌లో క్యూఆర్ కోడ్ చెల్లింపుల‌ను అందుబాటులోకి తేనుంది. దాంతో గూగుల్ పే, ఫోన్‌పే, క్రెడిట్‌, డెబిట్ కార్డుల‌తో పాటు అన్ని ర‌కాల డిజిట‌ల్ పేమెంట్స్‌ను ఆర్‌టీసీ బ‌స్సుల్లో అనుమతించాల‌ని ఆర్‌టీసీ ఎండీ స‌జ్జ‌నార్ సూచ‌న‌ప్రాయంగా సిబ్బందికి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. 
 
ఇప్ప‌టికే బండ్లగూడ‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ డిపోలోని బ‌స్సుల్లో పైలెట్ ప్రాజెక్టుగా డిజిట‌ల్ పేమెంట్ల‌ను అమ‌లు చేయగా, ఆ ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది. త్వరలో క్యూఆర్ కోడ్ విధానం అన్నీ రూట్ బస్సుల్లో అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.