'బాహుబలి' చిత్రంలోని భల్లాలదేవ ఫస్ట్‌లుక్ విడుదల
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క హీరోయిన్‌గా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ బల్గేరియాలో జరుగుతోంది. ఈ చిత్రంలో భల్లాలదేవగా ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న దగ్గుబాటి రానా పుట్టినరోజు నేడు (14 డిసెంబర్). ఈ సందర్భంగా 'బాహుబలి' చిత్రంలోని భల్లాలదేవ గెటప్‌ను రిలీజ్ చేశారు.
యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్, అనుష్క, దగ్గుబాటి రానా, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌కుమార్, కథ: వి.విజయేంద్రప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, మాటలు: ఎం.రత్నం, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.