సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (09:20 IST)

సన్నీ లియోన్ పర్సనల్ లైఫ్‌లో మహా సిగ్గరి.. వెల్లడించిన భర్త!

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి ఘాటు సన్నివేశాలనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్‌కు అలాంటి పాత్రలే వస్తున్నా

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి ఘాటు సన్నివేశాలనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్‌కు అలాంటి పాత్రలే వస్తున్నాయి. పైగా ఇటువంటి పాత్రలు రావడం పట్ల సన్నీ లియోన్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసినంత వరకు తను ఒక పోర్న్ స్టార్. 

కానీ సన్నీ గురించి పూర్తి వివరాలు చాలా మందికి తెలియదు. నూనిపోగు లేకుండా నీలిచిత్రాల్లో నటించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన పోర్న్ స్టార్ టర్నడ్ బాలీవుడ్ క్రేజీ స్టార్ సన్నీ లియోన్ పర్సనల్ లైఫ్‌లో మహా సిగ్గరట. ఈ విషయాన్ని ఆమె భర్త స్వయంగా మీడియాకి తెలిపాడు. అలాంటి సన్నీ పర్సనల్ లైఫ్ గురించి ఓ లుక్కేద్దామా... 
 
ఈమె అస్సలు పేరు సన్నీ లియోన్ కాదు కరణ్‌జిత్ కౌర్. చాలా మందికి ఈ విషయం తెలీదు. 
సన్నీ స్కేటింగ్ ప్లేయర్. సెక్స్ ఆటల్లోనే కాదు ఈ ఆటల్లో కూడా ఆరితేరింది. ఆటల్లో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఈ బాలీవుడ్ భామకు నచ్చిన హాలిడే స్పాట్ హవాయి.
సన్నీలియోన్ ఫేవరెట్ హాబీస్...పెయింటింగ్ , హార్స్ రైడింగ్.
 
ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకి రెండు దేశాల్లో సిటిజన్ షిప్ ఉంది. ఒకటి కెనడా అయితే మరొకటి అమెరికా.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే... 16 సంవత్సరాల వయసులోనే సన్నీ వర్జినిటీని పోగొట్టుకుంది. అది కూడా తన తోటి బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో.
ప్రపంచాన్ని తన అందంతో కట్టిపడేసిన సన్నీ తన 15 యేటలో బేకరీలో పనిచేసింది.