సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (15:31 IST)

రహస్యంగా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్.. ఫైమా పరిస్థితేంటి?

Patas Praveen
Patas Praveen
జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఫైమా-ప్రవీణ్ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో వేదికగా కూడా ప్రవీణ్ పై ఇష్టాన్ని ఫైమా బయటపెట్టింది. అయితే ప్రవీణ్ ప్రస్తుతం వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడంతో ఫైమా పరిస్థితి ఏంటని జనాలు వాపోతున్నారు. 
 
ప్రవీణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫైమా లవర్ ప్రవీణ్ వేరే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది. ఇది నిజమైన పెళ్లి కాదు. కేవలం ఓ యూట్యూబ్ ఛానల్ కోసం జరిగిన ఉత్తుత్తి మ్యారేజ్ అని క్లారిటీ ఇచ్చాడు. 
 
మరో జబర్దస్త్ కమెడియన్ కొమరం యూట్యూబ్ ఛానల్ ఈ మ్యారేజ్ వీడియో రూపొందించినట్లు తెలియజేశాడు. దాంతో ప్రవీణ్ నిజంగా వివాహం చేసుకోలేదని క్లారిటీ వచ్చేసింది.