గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2017 (20:17 IST)

పాపం పవర్ స్టార్ హీరోయిన్... ఆమె దుస్థితి వింటే చలించిపోతారు..!

తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో నటించిన మీరాజాస్మిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో సంగీత దర్శకుడు రాజేష్‌తో ప్రేమలో పడింది మీరా జాస్మిన్. త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ మీరాకు రాజేష్‌కు మధ్య గొడవలు రావడ

తెలుగు, తమిళ, మలయాళ బాషల్లో నటించిన మీరాజాస్మిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో సంగీత దర్శకుడు రాజేష్‌తో ప్రేమలో పడింది మీరా జాస్మిన్. త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ మీరాకు రాజేష్‌కు మధ్య గొడవలు రావడంతో ఆ ప్రేమ కథను అక్కడితో ముగించేసింది.
 
చివరకు దుబాయ్‌కు చెందిన పెళ్ళయిన వ్యక్తి , భార్యకు విడాకులివ్వకుండా ఉన్న అనిల్ చాట్ డైటస్ అనే పారిశ్రామికవేత్తను పెళ్ళి చేసుకుంది మీరా జాస్మిన్. పెళ్ళి చేసుకున్న తరువాత సినిమాల్లో అస్సలు నటించకూడదని మీరా జాస్మిన్‌కు షరతులు విధించడంతో సినీపరిశ్రమకు దూరమైపోయింది.
 
పెళ్ళయిన కొన్నిరోజులకే మీరా, అనిల్‌కు మధ్య గొడవలు రావడంతో అనిల్, మీరాజాస్మిన్‌ను వదిలేసి మొదటి భార్య దగ్గరకు వెళ్ళిపోయాడట. అయితే మీరా అలా వచ్చేయడం తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో మీరాను ఇంట్లోకి రానివ్వలేదట. ప్రస్తుతం ఆమె ఒక అద్దె ఇల్లు తీసుకొని బయట ఉంటోందట. 
 
గత కొన్ని నెలలుగా దర్శకనిర్మాతల చుట్టూ అవకాశాల కోసం తిరుగుతోందట. చిన్న క్యారెక్టర్ ఇచ్చినా ఫర్వాలేదు.. నాకు డబ్బు ముఖ్యమంటూ వారిని ప్రాధేయపడుతోందట మీరా జాస్మిన్. అయితే మీరాకు తగ్గ క్యారెక్టర్లు లేకపోవడంతో దర్శకనిర్మాతలు ఆమెకు అవకాశం ఇవ్వడం లేదట. పాపం... పవర్ స్టార్ హీరోయిన్... ఏ ఇండస్ట్రీ ఆదుకుంటుందో మరి!!