ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 14 మార్చి 2017 (10:10 IST)

2018 వేసవిలో "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి" రిలీజ్.. భారీ బడ్జెట్‌.. స్క్రిప్ట్ రెడీ?

చిరంజీవి 151వ సినిమా సెట్స్ పైకి రానుంది. బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసి.. స్వాతంత్ర్య సమరయోధుడిగా జీవితాన్ని చాలించిన "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి"గా నటించేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. ఈ సినిమా టై

చిరంజీవి 151వ సినిమా సెట్స్ పైకి రానుంది. బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేసి.. స్వాతంత్ర్య సమరయోధుడిగా జీవితాన్ని చాలించిన "ఉయ్యాలవాడ నరసింహారెడ్డి"గా నటించేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. ఈ సినిమా టైటిల్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బేనర్‌పై ఫిల్మ్‌చాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారు. ఇక చెర్రీ ధృవ సినిమాను తెరకెక్కించిన సురేందర్ రెడ్డిఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.  
 
ఏప్రిల్‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్ర్కిప్ట్‌ పని చివరి దశలో ఉంది. నరసింహారెడ్డిపై వచ్చిన పుస్తకాలను అధ్యయనం చేయడంతో పాటు, ఆయన కుటుంబీకుల నుంచి సమాచారాన్ని సేకరించి పరుచూరి సోదరులతో కలిసి స్ర్కిప్టును సురేందర్ రెడ్డి సిద్ధం చేసుకుంటున్నారు. 
 
అల్లూరి సీతారామరాజు తరహాలోనే సొంత సైన్యాన్ని ఏర్పాటుచేసుకున్ననరసింహారెడ్డి.. రాయలసీమ ప్రాంతంలో బ్రిటీష్‌ పాలకులకు చుక్కలు చూపించారు. అయితే ద్రోహులు ఇచ్చిన సమాచారంతో పాలకులు బందీగా పట్టుకుని 1847 ఫిబ్రవరి 22న ఉరితీశారు. 2018 వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. భారీ బడ్జెట్ మూవీగా దీన్ని తెరకెక్కించనున్నారు.