శనివారం, 21 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (15:54 IST)

పెళ్ళి పనుల్లో బిజీ బిజీ అయిన బాహుబలి నటులు.. ప్రభాస్, అనుష్క, తమన్నా...?

బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజైపోయాయి. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా కాస్త రిలాక్సయ్యారు. అంతేకాదు.. తమ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు. బాహుబలి రిలీజ్‌కు తర్వాత టాలీవుడ్ మోస్ట్

బాహుబలి సినిమా రెండు భాగాలు రిలీజైపోయాయి. ఇక ఈ మెగా ప్రాజెక్టు కోసం పనిచేసిన నటీనటులంతా కాస్త రిలాక్సయ్యారు. అంతేకాదు.. తమ వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టారు. బాహుబలి రిలీజ్‌కు తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్‌కు పెళ్లి చేసేయాలని.. ఆయన కుటుంబీకులు సంబంధాలు చూడటం మొదలెట్టారు.

అలాగే తెల్లపిల్ల అవంతికకు కూడా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. ఇక స్వీటీ కోసం బరువు పెరిగిన అనుష్క కూడా బరువు తగ్గించుకుని చేతిలో వున్న సినిమాలు ముగించుకుని వివాహం చేసుకోవాలని డిసైడైపోయింది.
 
"బాహుబలి 2" తరువాత ప్రభాస్ విదేశాల్లోనే ఎక్కువగా గడిపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. అయితే బాహుబలి హీరో ప్రభాస్ పెళ్ళి పనుల్లో వున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

'బాహుబలి 2' తరువాత రానా, అనుష్క, తమన్నా,. ఇలా అంతా కూడా ఎవరికి సంబంధించిన సినిమా పనుల్లో వాళ్లు వున్నారు. ప్రభాస్ మాత్రం చాలా అరుదుగా సినిమా ఫంక్షన్స్‌లో మెరుస్తున్నాడు. ఇందుకు కారణం అతడు పెళ్ళిచూపులకు వెళ్లడమేనని సమాచారం. త్వరలోనే ప్రభాస్ పెళ్ళి కన్ఫామ్ అయిపోతుందని టాక్.