సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 11 జులై 2017 (14:43 IST)

అది నచ్చితే ఎంతసేపయినా ఓకే... రాశీ ఖన్నా

యువ హీరోయిన్లలో రాశీ ఖన్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఉన్నా రాశీ. యువ నటులతో పాటు సీనియర్ నటులతో నటించిన రాశీఖన్నా కథ విషయంలో జాగ్రత్తపడుతోంది. కథ నచ్చిన తరువాత సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతోంది

యువ హీరోయిన్లలో రాశీ ఖన్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా అగ్రహీరోయిన్లలో ఒకరుగా ఉన్నా రాశీ. యువ నటులతో పాటు సీనియర్ నటులతో నటించిన రాశీఖన్నా కథ విషయంలో జాగ్రత్తపడుతోంది. కథ నచ్చిన తరువాత సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతోంది. సినిమాలో హీరో కన్నా హీరోయిన్‌కే అధిక ప్రాధాన్యత ఇచ్చే క్యారెక్టర్ అయితే ఇంకా ఇష్టమట. తనకు నచ్చిన కథ..తనకు ప్రయారిటీ ఉన్న క్యారెక్టర్ అయితే షూటింగ్‌లో ఎంతసేపయినా నటించడానికి సిద్థంగా ఉన్నానని చెబుతోందట రాశీ ఖన్నా. 
 
ఇప్పటికే ఈ భామ జై లవకుశ, టచ్ చేసి చూడు చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో హీరోకు పోటీగా ఉన్న క్యారెక్టర్లు కావడంతోనే రాశీ ఎంచుకుందట. ఇక మీదట నటించే సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్లే ఉండాలని దర్శకులను పట్టుబడుతోందట ఈ భామ.