ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (22:47 IST)

గుంటూరు కారం, టైగర్-3లో అతిథి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్?

NTR_Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ "గుంటూరు కారం". తాజాగా గుంటూరు కారం మూవీకి సంబంధించిన వార్త నెట్టింట్లో హల్ చల్ అవుతుంది. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ నడుస్తుంది. 
 
అలాగే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ "టైగర్‌ 3". ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమాలో కూడా అతిథి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
Salman_NTR
Salman_NTR
 
ఇక బాలీవుడ్ మూవీ "వార్‌ 2"లో హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా "టైగర్‌-3"తోనే ఆయన పాత్రని పరిచయం చేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మరి టైగర్‌ 3, అలాగే గుంటూరు కారంలో ఎన్టీఆర్‌ నిజంగానే కనిపిస్తారా? చూడాలి.