మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (16:45 IST)

'భరత్ అను నేను'లో మహేష్ లుక్... వైఎస్ జగన్, కేటీఆర్‌లా వుంటుందా?

మహేష్ బాబు స్పైడర్ చిత్రం ఇటీవలే విడుదలై మిశ్రమ ఫలితాలను కూడగట్టుకుంది. ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. మరో

మహేష్ బాబు స్పైడర్ చిత్రం ఇటీవలే విడుదలై మిశ్రమ ఫలితాలను కూడగట్టుకుంది. ఇకపోతే ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు. మరో విశేషం ఏమిటంటే... మహేష్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రిభినయం చేస్తుండటం. రాజకీయ నాయకుడుగానూ, ఎన్నారైగానూ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. 
 
ఇకపోతే మహేష్ బాబు లుక్ వైసీపి చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెరాస మంత్రి కేటీఆర్ లుక్ రెండింటితో కలగలిపి వుంటుందని చెప్పుకుంటున్నారు. రాజకీయ నాయకుడు పాత్రలో వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మహేష్ బాబు అగుపిస్తారని అంటున్నారు. ఇక ఎన్నారై పాత్రలో మోడ్రన్ లుక్‌తో అదరగొడతాడని అని చెపుతున్నారు.