1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Trisha is setting a new record

లియోతో త్రిష రికార్డ్.. ఏంటది..?

Trisha
సీనియర్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతోంది. పీఎస్2 తర్వాత ఆమె దశ తిరిగింది. మణిరత్నం తీసిన "పొన్నియన్ సెల్వన్" చిత్రం తమిళనాడులో కొత్త రికార్డులు నెలకొల్పింది. పీఎస్ -2కి తర్వాత ఆమెకి మళ్ళీ క్రేజ్ పెరిగింది. అలా ఆమె విజయ్ సరసన "లియో" చిత్రంలో నటించింది.
 
"లియో" కూడా మొదటివారం భారీ వసూళ్లు అందుకొంది. తెలుగులో ఇప్పటికే ఈ సినిమా హిట్. ఇక తమిళ్ వర్షన్ కూడా సూపర్‌‌గా ఆడుతోంది. అమెరికాలో ఈ సినిమా 5 మిలియన్ వసూళ్ల దిశగా సాగుతోంది. దాంతో, అమెరికాలో మూడు "5 మిలియన్ల" మూవీస్ లిస్టులో వున్న మొదటి తమిళ హీరోయిన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. 
 
పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం 6 మిలియన్లు, రెండో భాగం 5 మిలియన్ల వసూళ్లు అందుకున్నాయి. ఇప్పుడు "లియో" కూడా రెండో వారంలో 5 మిలియన్ల మార్క్ అందుకోవచ్చు. ఇకపోతే.. దీంతో త్రిషకి ఇంకా క్రేజ్ పెరగడం ఖాయం. ఆమెకిప్పుడు 39 ఏళ్ళు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
బిగ్ బాస్‌లో మెరిసిన దేత్తడి హారిక... హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది...