సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:21 IST)

మలయాళ నిర్మాతతో త్రిష పెళ్లి?

Trisha
చెన్నై చంద్రం త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వస్తోంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన 21 ఏళ్లైనప్పటికీ తరగని అందంతో సినీ ఆఫర్లతో రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయంటే త్రిష డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
మరోవైపు త్రిష గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మలయాళ నిర్మాతను త్రిష పెళ్లాడబోతోందని ఫిలిమ్ నగర్ టాక్ వస్తోంది. 
 
గతంలో ఓ సినిమా సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ వార్తలు ఎంత వరకు నిజమనేది వేచి చూడాలి.