శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వరుణ్

కోలీవుడ్ సంగీత దర్శకుడితో కీర్తి సురేశ్ పెళ్లి?

keerthy suresh
కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్‌తో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అయింది. దీనిపై కీర్తి సురేశ్ తండ్రి ఖండిస్తూ వివరణ ఇచ్చారు. గతంలోనూ ఇలాంటి కథనాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. పైగా, అసత్య కథనాలను ప్రచారం చేసి తమ కుటుంబంలో అశాంతిని రేకెత్తించవద్దని ఆయన కోరారు. 
 
కీర్తి సురేశ్ - అనిరుధ్ రవిచంద్రన్‌లు గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ ఇపుడు రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై కీర్తి సురేశ్ స్పందిస్తూ అనిరుధ్ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. 
 
తాజాగా పుకార్లపై ఆమె తండ్రి స్పందించారు. ఇలాంటి విషయాలపై పుకార్లు చేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు. కీర్తికి పెళ్లి కుదిరితే మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తామని తెలిపారు. ఇలాంటి తప్పుడు కథనాలతో తమ కుటుంబంలో అశాంతిని కలిగించవద్దని ఆయన కోరారు.