శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (12:23 IST)

నాగ చైతన్యతో సాయిపల్లవినా? లేకుంటే కీర్తి సురేషా?

keethi suresh
టాలీవుడ్ హీరో నాగ చైతన్య మత్స్యకారుల కథతో సినిమా చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మిస్తున్న పేరులేని చిత్రం #NC23గా తెరకెక్కుతోంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనుంది.
 
పాన్-ఇండియన్ ప్రేక్షకులను ఆకట్టుకునే స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇంకా చందూ మొండేటి మునుపటి చిత్రం "కార్తికేయ 2" దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద విజయవంతమైంది.
 
ఇదే సక్సెస్ మోడ్‌లో చైతూతో కొత్త సినిమాను బంపర్ హిట్ చేయాలని చందు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఈ సినిమాలో దర్శకుడు చందూ మొండేటి సాయి పల్లవిని నటింపజేయాలని భావిస్తున్నాడు. ఎందుకంటే ఈ చిత్రానికి బలమైన నటనతో తీసిన నటి అవసరం. అలాగే కీర్తి సురేష్ పేరు కూడా ఈ సినిమా కోసం వినిపిస్తోంది. 
Sai Pallavi
Sai Pallavi
 
సాయి పల్లవి గతంలో శేఖర్ కమ్ముల "లవ్ స్టోరీ"లో నాగ చైతన్యతో కలిసి పనిచేసినందున, నాగ చైతన్య- కీర్తి సురేష్‌ల జోడి రిఫ్రెష్ అవుతుందని టీమ్‌లోని కొందరు భావిస్తున్నారు. మరి వీరిద్దరిలో ఎవరిని చందూ సెలెక్ట్ చేస్తారనేది తెలియాలంటే వేచి వుండాల్సిందే.