1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (16:54 IST)

చిరంజీవి గారిని ఇప్పుడు యూత్ చూసేలా 70 శాతం మార్పులు చేశాం : మెహర్ రమేష్

mehar ramesh, chiru, keerti
mehar ramesh, chiru, keerti
దర్శకుడి ఏం కావాలో అన్నయ్య కి బాగా తెలుసు. ఇందులో నా ఒక్కడికే దక్కిన అదృష్టం ఏమిటంటే నేను అన్నయ్య కజిన్. చిన్నప్పటినుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేసి ఆయనతో 'బావుందిరా' అనిపించుకున్నాను. ఇలాంటి అదృష్టం అందరికీ దక్కదు. నేను డైరెక్టర్ అయ్యిందే ఈ సినిమా చేయడానికేమో. ఇది పెద్ద అచీవ్ మెంట్. దీని తర్వాత చేసేదంతా బోనస్- అని డైరెక్టర్ మెహర్ రమేష్ అన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు చేశారు.. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ను నిర్మించారు. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ మెహర్ రమేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
 
mehar ramesh
mehar ramesh
చాలా గ్యాప్ తర్వాత ఫస్ట్ డే మైక్ పట్టుకున్నపుడు ఎలా అనిపించింది ?
భోళా శంకర్ షూటింగ్ 2021 నవంబర్ 15న మొదలుపెట్టాం.  మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, భారీ సెట్ లో మెగా లెవల్ సినిమా స్టార్ట్ చేశాం. అన్నయ్య ని డైరెక్ట్ చేయడం ఒక డ్రీమ్. ఇప్పటికీ ఆ డ్రీంలోనే వున్నాను. ఆగస్ట్ 11 ఆ డ్రీం రిలీజ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి అన్నయ్యని, ఆయన సినిమాలని చూస్తూ ఆయన్ని ఇలా చూపించాలని ప్రతి క్షణం తపనపడుతూ ఈ సినిమా తీశాం. అన్నయ్య ఇచ్చిన ఎనర్జీతో సినిమా మొత్తం అయిపోయింది. అన్నయ్య కూడా చాలా ఎంజాయ్ చేశారు. 
 
ఈ సినిమా ఒక పిక్నిక్ లా గడించిందని చిరంజీవి గారు అన్నారు ? అలాంటి వాతావరణం ఎలా క్రియేట్ చేస్తారు ?
అన్నయ్య సెట్స్ లో ఉంటేనే ఒక పిక్నిక్ లా వుంటుంది. ఆయన కార్వాన్ లోకి కూడా వెళ్లారు. సెట్ లోనే అందరితో సరదాగా వుంటారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు.  సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా ఫాస్ట్ గా చేసేసావ్'' అని అన్నారు. దర్శకుడిగా నేను ఫాస్ట్ ఫిలిం మేకర్ ని.  బిల్లా సినిమా నాలుగున్నర నెలలో పూర్తి చేశాం. ఫాస్ట్ గా ఫిలిం తీయడంలో దాని రికార్డ్ ఇంకా ఎవరూ కొట్టలేదు. భోళాని కూడా చాలా ఫాస్ట్ గా తీశాం. 120 వర్కింగ్ డేస్. అంతా పిక్నిక్  లా  జరిగింది.
 
చిరంజీవి గారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారు ?
సినిమా విషయంలో అన్నయ్య సలహాలు సూచనలు ఖచ్చితంగా వుంటాయి. రీమేక్ సినిమా అయినప్పటికీ ఆయనకి నచ్చితేనే ఆమోదముద్ర పడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే చాలా చక్కగా ప్రశంసిస్తారు. చాలా విలువైన ఇన్పుట్స్ ఇస్తారు.
 
వేదాళం రీమేక్ చేయడానికి కారణం ఏమిటి ?
చిరంజీవి గారిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం వుండదు. ఇందులో అన్నయ్య తత్త్వం వుంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్ మారిపోయినా అనుబంధాలు అలానే వున్నాయి. యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు బ్రదర్ సిస్టర్ ఎమోషన్ వున్న కథ ఇది. నేను ఇలాంటి సబ్జెక్ట్ ఎప్పుడూ డీల్ చేయలేదు. చిరంజీవి గారి ఇమేజ్ కి తగ్గట్టుగా ఇందులో మార్పులు చేశాం. సెకండ్ హాఫ్ చిరంజీవి గారికి ఇచ్చిన ట్రీట్  కంప్లీట్ డిఫరెంట్ గా వుంటుంది.  ఒరిజినల్ కి దాదాపు 70 శాతం మార్పులు చేశాం. అన్నయ్య నాకు ఎలా కనిపిస్తారో అది ఈ సినిమాలో చూపించా. అన్నయ్య నాకు హిమాలయ శిఖరం లా కనిపిస్తారు.  
 
ఈ పదేళ్ళలో మీ దగ్గరికి మంచి కథలు రాలేదా ? గ్యాప్ రావడానికి కారణం ఏమిటి ?
కొన్ని కథలు చేసుకున్నాను. ఐతే అన్నయ్య కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయనతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. మన కమ్ బ్యాక్ కూడా అన్నయ్యతోనే అనుకున్నాను. (నవ్వుతూ). అందుకే షాడో లో వున్న నాపై మెగా లైట్ పడిందని ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను.
 
ఇప్పుడు రిమేక్ అంటే రిస్క్ కదా .. ఈ రిస్క్ ఎలా తీసుకున్నారు ?
రిస్క్ కంటే బిగ్ టాస్క్ అనుకున్నాం. బిల్లా కూడా  టాస్కే.  ప్రభాస్ ని ఎలా చూపించాలనేడి నా టేక్. అలాగే భోళా శంకర్ కూడా. రిమేక్ చేయడం పెద్ద టాస్క్ . ఒక పెద్ద సక్సెస్ అయినదానిని  కరెక్ట్ గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. భోళా శంకర్ ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజంట్ చేశాం. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ తర్వాత ఎలా తీద్దామని అనుకున్నానో అలానే తీశాను.  ఇందులో చిరంజీవి గారి మార్క్ ఉంటేనే కొత్తగా వుంటుంది. చిరంజీవి గారి సినిమా నుంచి కావాల్సిన అన్ని అంశాలు భోళా శంకర్ లో వుంటాయి. అడిషనల్ గా చిరు లీక్స్ ద్వారా వచ్చిన పవర్ స్టార్ గారి మేనరిజం కూడా (నవ్వుతూ). అన్నయ్య పై వున్న ప్రేమ అభిమానం చూపించడానికే ఈ కథ నాకోసం ఎదురుచూసింది.  
 
మహతి సాగర్ తో మ్యూజిక్ చేయడానికి కారణం ?
మణిశర్మ గారు మ్యూజిక్ లో మెగాస్టార్ . అన్నయతో సినిమా చేస్తున్నపుడు మణిశర్మగారి పేరో మరో పెద్ద సంగీత దర్శకుడి పేరో అనుకోవడం సహజం. ఐతే ముఫ్ఫై ఏళ్ళ క్రితం చిరంజీవి గారి ఫ్యాన్ కి ఇప్పుడు కొడుకో కూతురో వుంటున్నారు . వాళ్ళు అన్నయ్య సినిమాకి వచ్చి పేపర్స్ ఎగరేస్తున్నారు. జనరేషన్  మారింది కానీ ఆయనపై వున్న ప్రేమ అభిమానం మారలేదు.  ఒక యంగ్ వైబ్  కావాలని అనుకున్నాం. మహతి సాగర్ వర్క్ నాకు తెలుసు. మెగాస్టార్ స్థాయి కి సాగర్ మ్యూజిక్ చేయగలడని నా నమ్మకం, ఈ విషయంలో గొప్పదనం అంతా అన్నయ్యదే. సాగర్ పేరు చెప్పినపుడు మరో ఆలోచన లేకుండా ‘వెరీ గుడ్ మనం ప్రోత్సాహంచాలి’ అన్నారు. సాగర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. భోళా మానియా, జామ్ జామ్, తీనుమారు ఇలా పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. నేను కూడా పాటలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఇందులో ఒక ర్యాప్ సాంగ్ రాశాను. ప్రేక్షకులు అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తారు.
 
కీర్తి సురేష్ ని చెల్లెలు పాత్రలోకి ఎలా తీసుకొచ్చారు ?
మెగాస్టార్ కి ఒక మెగా నటి కావాలి. స్వప్న దత్ గారి ద్వారా ఈ పాత్ర గురించి చెప్పడం జరిగింది. స్వప్నదత్ గారికి థాంక్స్ చెప్పాలి.  ఈ కథ లోని ఎమోషన్  కి  కీర్తి సురేష్   చాలా కనెక్ట్ అయ్యింది. వెంటనే చేస్తానని చెప్పారు. వాల్తేరు వీరయ్యలో బ్రదర్ సెంటిమెంట్ గా రవితేజ ఎసెట్. ఇందులో కీర్తి సురేష్ పాత్ర కూడా సిస్టర్ సెంటిమెంట్ గా హైలెట్ వుంటుంది. అలాగే తమన్నా, సుశాంత్ ల పాత్రలు కూడా చాలా చక్కగా కుదిరాయి. పాత్రలన్నీ చాలా మంచి వినోదం పంచుతాయి.  
 
నిర్మాతల నుంచి ఎలాంటి సహకారం వుండేది ?
అనిల్ సుంకర గారు ఎప్పటి నుంచో చిరంజీవి గారితో సినిమా చేయాలని అనుకున్నారు. నిన్న సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారితో ఎలాంటి సినిమా తీయాలని అనుకున్నామో అలాంటి సినిమా తీశామని హ్యాపీగా ఫీలయ్యాం. అనిల్ గారు చాలా పాజిటివ్ పర్సన్. సినిమా అంటే పాషన్ వున్న ప్రొడ్యుసర్. ఆయనకి సినిమాపై పూర్తి అవగాహన వుంది. ఎక్కడా రాజీపడకుండా కావాల్సింది సమకూర్చి చాలా గ్రాండ్ గా ‘భోళా శంకర్’ ని నిర్మించారు.    
 
భోళా శంకర్ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు ?
భోళా శంకర్ ని ఇంటిల్లపాది థియేటర్ కి వెళ్లి చూడండి. మనం యూత్ లో వున్నప్పుడు చిరంజీవి గారిని ఇప్పుడు యూత్ కి హ్యాపీగా చూపించండి.