ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (18:07 IST)

సినిమా అనే యుద్ధభూమిలో సైన్యాధక్షుడు అయిన చిరంజీవి పై హైపర్ ఆది చిరు జల్లులు

chiru- aadi
chiru- aadi
తూటాల్లా  మాటలే వస్తే.. హైపర్ ఆది- నిప్పుల వాన పదాలై పడితే.. హైపర్ ఆది- వడగళ్ల వాన అక్షరాలై కురిస్తే.. హైపర్ ఆది ఉప్పెనలా మనసులో భావాలు బయటకొస్తే.. హైపర్ ఆది- పాల సంద్రంలా అభిమానం ఉప్పొంగితే.. హైపర్ ఆది- కెరటాలై ప్రేమ ఉరికురికి వస్తే.. హైపర్ ఆది- అదీ.. హైపర్ ఆదీ అంటే. 49 ఏళ్ళ కెరీర్ లో చిరంజీవి పడ్డ ఆటుపోట్లు గురించి తనదైన పంచ్ లతో ఆకట్టుకున్నాడు. ఇది భోళా శంకర్ ప్రీరిలీజ్ లో ఆది అభిమానాన్ని చాటడంతో  దాంతో శిల్ప కళా వేదిక హోరెత్తినది.
 
 మెగాస్టార్ చిరంజీవి పై గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానం చిరు జల్లుల్లా పడుతుంటే తడిసి ముద్ద అవ్వని మెగాభిమాని లేడు. ఆది మాటల ప్రవాహం చిరంజీవి కళ్ల నుంచి జాలువారిన ఆనంద భాష్పాలే అయ్యాయి.  ఆది చెప్పిన ప్రతి మాట వాస్తవం.. ప్రతి మెగాభిమాని మనసు పొరల్లో దాచుకున్న అక్షరాలు. చిరంజీవికి, ప్రపంచానికి ప్రతి మెగాభిమాని చెప్పాలని అనుకున్న మాటలకు ఆది గొంతుక ఒక ఘంటారావం అయింది. సినిమా అనే యుద్ధభూమిలో సైన్యాధక్షుడు అయిన  చిరంజీవి అంటూ హైపర్ ఆది చిరు జల్లులు కురిపించారు. 
 
 
అభిమానుల రుణం ఎలా తీర్చుకునేది అని మెగాస్టార్ చిరంజీవి అంటారు. కానీ.. ఆది తన అభిమానంతో అభిమానిగా చిరంజీవి రుణం తీర్చుకున్నారు.  చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకున్న ఎంతోమంది అభిమానుల్లో ఒకరైన ఆది ఆ చిరంజీవే గర్వపడేలా చేశారు. మెగాస్టార్ చిరంజీవి కష్టాన్ని, 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని, విజయాల్ని మాత్రమే కాదు.. అపజయాలను, విమర్శలను సైతం అయన ఢీకొట్టి నిలిచి గెలిచిన ఉదంతాలను ప్రపంచానికి తన గళం ద్వారా చెప్పినందుకు హైపర్ ఆదికి మెగాభిమానులు సర్వదా కృతఘ్నులు.
 
భవిష్యత్తులో హైపర్ ఆది గారు మరిన్ని విజయాలు అందుకోవాలని.. నటనా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చిరంజీవి గారి తరపున మెగా అభిమానుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అఖిల భారత చిరంజీవి యువత ప్రెసిడెంట్ రవణం స్వామినాయుడు ఇలా అభినందించారు.