బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (12:49 IST)

ఫాన్స్ ఫార్మేట్ లో తీసిన యాక్షన్ డ్రామా భోళా శంకర్ :రివ్యూ

Bhola Shankar
Bhola Shankar
నటీనటులు: చిరంజీవి, తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, ఉత్తేజ్
 
సాంకేతికత: సినిమాటోగ్రఫీ: డడ్లీ, సంగీతం: మహతి స్వర సాగర్, నిర్మాతలు: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర, అజయ్ సుంకర, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, దర్శకుడు : మెహర్ రమేష్. 
 
మెగాస్టార్ చిరంజీవి అభిమాని, బంధువు అయిన మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్.  అజిత్ చేసిన వేదాళం సినిమాకు  రేమేక్. కాగా ఇలాంటి కథలు కొత్తదనం లేదు అని అంటే, చాలా మార్పులు చేశామని దర్శకుడు, నిర్మాత తెలిపారు. ఈ సినిమా విడుదల సమయంలో వైజాగ్ పంపిణీదారుడు కోర్ట్ కు వెళ్లడం కూడా జరిగింది. మొత్తానికి క్లియర్ అయినా ఈ సినిమా నేడే విడుదల అయింది. మరి ఎలా ఉందొ చూద్దాం.
 
కథ 
శంకర్ (చిరంజీవి) ఆమె  చెల్లి మహాలక్ష్మి (కీర్తి సురేష్) కోల్కతా వస్తారు. రఘుబాబు వల్ల వెన్నెల కిషోర్ క్యాబ్  ఆఫీసులో డ్రైవర్ గా చేరతాడు. ఆ తర్వాత తన చెల్లి చదువుకోసం కాలేజీకి వెళ్లి సీట్ వచ్చేలా చేస్తాడు. సిటీలో పోలీసులకు సవాల్ గా ఉండేలా ఓ మాఫియా గ్యాంగ్ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు. అల్లాంటి వారు అనుమానంగా కనిపిస్తే తమకు ఫోన్ చేసి చెప్పమని క్యాబ్ డ్రైవర్స్ కు మీటింగ్ పెట్టి సిటీ పోలీస్ కమిషనేర్ ఓ నెంబర్ ఇస్తాడు. ఆ తర్వాత శంకర్ ఓ గ్రూప్ కదలికలు అనుమానంగా ఉంటె పోలీస్ కమిషనేర్ కే నేరుగా శంకర్ ఫోన్ చేస్తాడు. అప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో కొందరు చనిపోతారు. దీంతో అహం దెబ్బతిన్న మైఫియా గ్యాంగ్ నేత శంకర్ ను ట్రేస్ చేసి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ లో కీలక మనుషులను శంకర్ చంపేస్తాడు. దాంతో మెయిన్ లీడర్ వచ్చి మహాలక్ష్మిని కిడ్నాప్ చేస్తాడు.  ఆ తర్వాత ఏమైంది. అసలు శంకర్ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి. లాయర్ లాస్య (తమన్నా)తో ఎలా పరిచయం. అనే విషయాలే మిగిలిన కథ. 
 
సమీక్ష:
ఈ సినిమా చిరంజీవి ఇమేజ్ ను బేస్ చేసుకుని చేసిందే. ఎక్కడా కొత్త దనం కనిపించదు. ఆల్రెడీ తెలిసిన కథ కాబట్టి కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. అందుకే చిరంజీవితో ఎంటర్టైన్ చేయించారు. దానికి వెన్నెల కిషోర్, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను తోడయ్యారు. శ్రీ ముఖి తో ఖుషి సీన్ బొడ్డు చూసే విధానాన్ని చిరంజీవి తో చేయించారు. కొన్ని చోట్ల పవన్ మేనరిజమ్ చేశారు. ఇలా సాగుతున్న కథలో తమన్నా రావడం, ఆమె సోదరుడు సుశాంత్, మహాలక్ష్మిని లవ్ చేయడం అంతా వందల సినిమాల్లో ఫార్మేట్ దించేశారు. 
 
ఇక  యాక్షన్ డ్రామా మాములుగా ఉండదు. తలలు లేచిపోతాయి. హింస ఎక్కువే. పెద్ద హీరోస్ లు ఇల్లాంటివి పరిమితంగా చూపిస్తే బాగుంటుంది. చెల్లి కోసం రావడం, రౌడీస్ నుంచి తప్పించుకోవడం వంటి సీన్స్ రొటీన్ గా చూపించాడు దర్శకుడు. ఎక్కడా ట్విస్ట్ లు కనిపించవు. రష్మీ గౌతమ్ ఐటెం గర్ల్ గా నటించింది.  సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ తో పాటు, పాత్రలోని షేడ్స్ ను, తమన్నాతో సాగే సీన్స్,  ప్లాష్ బ్యాక్ లోని ఎమోషనల్ ప్లస్ అయ్యాయి. 
 
కీర్తి సురేష్ పాత్రకు న్యాయం చేసింది. రఘు బాబు, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, మురళి శర్మ తో పాటు  మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.. కథనం విషయంలో మెహర్ రమేష్ చేసిన ప్రయత్నం పర్వాలేదు.  కొన్ని చోట్ల మెలో డ్రామాలా అనిపిస్తోంది. సెకండాఫ్ లో కూడా కొన్ని చోట్ల ప్లే స్లోగా సాగింది. ప్రధానంగా మాఫియా తో హింస ఎక్కువ ఉంది. మురళి శర్మ ఇల్లు కబ్జా అనేదే పాత కదలా అనిపిస్తుంది. అక్కడ బలమైన ఎమోషన్ ఇంకా పండితే బాగుండేది. అందుకే పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ భోళా శంకర్ లేదనే చెప్పాలి. 
 
దర్శకుడు మెహర్ రమేష్ అభిమానిగా టేకింగ్ బాగా డీల్ చేసాడు. కథను పూర్తిగా మారిస్తే ఇంకా బాగుండేది.  స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా లేదు. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఆకట్టుకునేలా ఉంది. డడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్, ఏకే ఎంటర్టైన్మెంట్స్  నిర్మాణ విలువలు బాగున్నాయి. చిరంజీవి సినిమాఅంటే సరికొత్తగా ఉండాలి. గాడ్ ఫాదర్ లాంటి మలుపులు కనిపించాలి. అసలు నీకు నటించడం వచ్చా! అని తమన్నా కోర్ట్ లో దొంగ  సాక్ష్యం చిరుతో చూపించే సీన్లో అంటుంది. ఇలాంటివి సరదగా ఉన్నా, కథ లో అంతకు మించి ఉంటె బాగుండేది.