గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (19:56 IST)

లావణ్య త్రిపాఠికి రూ.3కోట్లు నష్టం.. ఎందుకో తెలుసా?

Lavanya Tripathi
మెగావారింటి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. అందులో మొత్తం అడల్ట్ కంటెంట్ సన్నివేశాలే వుండటంతో ఆమె నో చెప్పింది. కెరీర్‌లో ఇప్పటి వరకు ఆఫర్ చెయ్యని రేంజ్ రెమ్యూనరేషన్‌ని ఆఫర్ చేశారు. 
 
దాదాపుగా రూ.3కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. అంత ఆఫర్ చేసినా కూడా లావణ్య త్రిపాఠి ఒప్పుకోలేదట. కారణం వరుణ్ తేజ్‌తో పెళ్లి ఫిక్స్ కావడమేనని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 
 
డబ్బులిస్తే ఎక్స్‌పోజ్ చేసేందుకు వెనుకాడని హీరోయిన్ల మధ్య లావణ్య త్రిపాఠి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా కూడా ఒప్పుకోలేదంటే.. ఆమె కమిట్మెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చునని సినీ పండితులు అంటున్నారు.