శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2023 (17:18 IST)

అభిరామ్ దగ్గుబాటికి పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా?

Abiram daggupati
అభిరామ్ దగ్గుబాటి ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు,  నటుడు రానా దగ్గుబాటి తమ్ముడు. ఆయన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ప్రారంభంలో, అతను నిర్మాతగా తన వృత్తిని ప్రారంభించాడు. రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమాను నిర్మించాడు. 
 
తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమా ద్వారా అభిరామ్ వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో అభిరామ్ సరసన గీతిక తివారీ నటించింది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అభిరామ్ దగ్గుబాటి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. 
 
దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దగ్గుబాటి వివాహం వారి ఇంట్లోనే జరగబోతోందన్న వార్త అభిమానులను కూడా చాలా సంతోషపరుస్తోంది. దివంగత రామానాయుడు తమ్ముడి మనవరాలిని అభిరామ్ పెళ్లి చేసుకోనున్నారు. 
 
దగ్గుబాటి ఫ్యామిలీ పెళ్లి హడావుడిలో ఉన్నట్లు తెలుస్తోంది. సురేష్ బాబు సోదరి కుమార్తెను అభిరామ్ పెళ్లి చేసుకోనున్నాడు. ప్రస్తుతం వధువు కుటుంబం కారంచేడులో నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అభిరామ్ కూడా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడని సమాచారం. 
 
డిసెంబర్ 6న పెళ్లి జరగనుండగా.. శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ పెళ్లిని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సురేష్ బాబు కూతురు మాళవిక పెళ్లి పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.