సంబంధిత వార్తలు
- సోనూ సూద్ కోసం పాదయాత్ర.. 700 కి.మీటర్లు కాలినడకన..?
- సోనూ సూద్‌పై తమ్మారెడ్డి ఏమన్నారంటే..? తెలిస్తే షాకవుతారు..!
- నేను సూపర్ హీరో కాదు.. సోనూసూదే అర్హుడు.. కేటీఆర్ ట్వీట్ వైరల్
- చిరంజీవినే కాదు సినిమా వాల్ళను విమర్శించే హక్కు ఎవరికీ లేదుః కాశీ విశ్వనాథ్
- గ్రామాలకు డెడ్ బాడీ ఫ్రిజర్ బాక్స్‌లను అందిస్తున్న సోనూసూద్
సోనూసూద్ ఒక్కసారిగా పారితోషికం ఎందుకు పెంచారు?
కరోనాకు ముందు సోనూసూద్ సినిమాల్లో విలన్‌గా పరిచయమే. కానీ కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆపన్నహస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్నారు. ఆపదలో ఉన్నా ఆదుకో అన్నా అని పిలిచేవారందరీ చేరువయ్యాడు. తన వంతు సహాయం చేశాడు.
ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తున్నాడు సోనూసూద్. అతను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య మూవీలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. తాజాగా అఖండ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అఖండ చిత్రంలో ఒక కీలక పాత్రను కూడా పోషించబోతున్నారట.
అయితే ఆ క్యారెక్టర్ చేయాలంటే 7 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారట సోనూసూద్. అల్లుడు అదుర్స్ సినిమాకు రెండు కోట్లు అందుకున్న సోను ఒకేసారి ఇంత మొత్తంలో పారితోషికాన్ని పెంచడంతో నిర్మాతలు అవాక్కయ్యారట. ముందుగా అనుకున్న బడ్జెట్ లెక్కల ప్రకారం సోనూకు అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సోనూ అంతమొత్తం అడిగితే తప్పేమీలేదంటున్నారు అభిమానులు.
తర్వాతి కథనం
